ఇది మన గడ్డ.. సెటిలర్స్ అనేమాట తీసేయండి..శేరిలింగంపల్లిలో తుమ్మల
" సెటిలర్స్ అనే మాట తీసేయండి ఇది మన గడ్డ...ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదు" అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వాఖ్యలు చేశారు.

- రామ రాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం
- ఓ కుటుంబం నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ ను గెలిపించండి
- శేరిలింగంపల్లిలో తుమ్మల సంచనల వాఖ్యలు
- కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌కు మద్దతుగా ప్రచారం
విధాత, హైదరాబాద్: ” సెటిలర్స్ అనే మాట తీసేయండి ఇది మన గడ్డ…ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదు” అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యంతో రామ రాజ్యం చూశామన్నారు.
రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యమన్నారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే, చంద్రబాబు ఆత్మ విశ్వాస రాజకీయాలు నేర్పారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఐ.టీ టవర్స్, ఔటర్ రింగు రోడ్డు,శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణాలతో పూర్తి స్థాయి మౌలిక సౌదుపాయాల కల్పన ద్వారా హైదరాబాద్‌కు చంద్రబాబు నాయుడు విశ్వ నగరం గా పునాది వేశాడన్నారు. 2020 విజన్ తో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ది చేశారన్నారు.
చరిత్రలో నిలిచిన సోనియా
రాజకీయం గా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా సోనియా గాంధీ చరిత్ర లో నిలిచారని తుమ్మల అన్నారు. తెలంగాణ లో అహంకారం దోపిడీ మాఫీయా కబ్జా రాజ్యం గా మారిందని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు మాఫీయా గా మారారన్నారు. పోలీస్ లను ఎమ్మేల్యే లకు అప్ప చెప్పారన్నారు. ప్రజా స్వామిక తెలంగాణ కోసం ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు.
ఓ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని ప్రజలకు తుమ్మల పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు చారిత్రకమైనవన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది పలకాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు.