సందిట్లో సడేమియాలు.. ఓ వైపు భూకంపంతో తుర్కియే విలవిల..! మరో వైపు దొంగల బీభత్సం..!!

Turkey Earthquake | భారీ భూకంపాలతో ఓ వైపు తుర్కియే విలవిలలాడుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 25వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నేలకూలిన వేలాది భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు దోపిడీ దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. భూకంపం తర్వాత దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలపై శనివారం దాదాపు 48 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది ప్రావిన్సులో అనుమానితులను అరెస్టు చేసినట్లు అనడోలు వార్తా సంస్థ తెలిపింది. […]

సందిట్లో సడేమియాలు.. ఓ వైపు భూకంపంతో తుర్కియే విలవిల..! మరో వైపు దొంగల బీభత్సం..!!

Turkey Earthquake | భారీ భూకంపాలతో ఓ వైపు తుర్కియే విలవిలలాడుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 25వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నేలకూలిన వేలాది భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు దోపిడీ దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. భూకంపం తర్వాత దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలపై శనివారం దాదాపు 48 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది ప్రావిన్సులో అనుమానితులను అరెస్టు చేసినట్లు అనడోలు వార్తా సంస్థ తెలిపింది.

అలాగే దక్షిణ హటే ప్రావిన్స్‌లో భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆరు ట్రక్కుల ఆహారాన్ని దోచుకునేందుకు దోపిడీ దొంగలు యత్నించినట్లు వార్తాసెట్‌ పేర్కొంది. దోపిడీ దొంగలను అణచివేస్తామని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇంతకు ముందు ప్రకటించారు. భూకంపం సంభవించిన దియార్‌ బాకిర్‌ ప్రావిన్స్‌ను సందర్శించిన ఆయన.. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దోపిడీలు, కిడ్నాప్‌లు పాల్పడే వారికి ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇదిలా ఉండగా.. భూకంపం కారణంగా తుర్కియేలో 21,848 మంది మృతి చెందగా.. 80,04 మది గాయపడ్డారని ఎర్డోగాన్‌ శనివారం తెలిపారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సిరియాలో 2,166 మంది, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిరియాలో 1,387 మంది ప్రాణాలు కోల్పోయారు.