Turkey-Syria earthquake | తుర్కియే, సిరియాలో మృత్యుహేళ..
Turkey-Syria earthquake | తుర్కియా, సిరియాలో భూకంపం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య శుక్రవారం అర్ధరాత్రి వరకు 24వేలు దాటింది. ఇప్పటి వరకు 20,123 మంది ప్రాణాలు కోల్పోయగా.. 80,052 మంది గాయపడ్డారని తుర్కియే ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. శిథిలాల నుంచి రక్షించిన పౌరులందరినీ ప్రభావిత ప్రాంతాల వెలుపల వెలుపల ఉన్న ప్రావిన్స్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తింపు తెలియని వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఫొటోలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు కోకా తెలిపారు. మరో […]

Turkey-Syria earthquake | తుర్కియా, సిరియాలో భూకంపం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య శుక్రవారం అర్ధరాత్రి వరకు 24వేలు దాటింది. ఇప్పటి వరకు 20,123 మంది ప్రాణాలు కోల్పోయగా.. 80,052 మంది గాయపడ్డారని తుర్కియే ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. శిథిలాల నుంచి రక్షించిన పౌరులందరినీ ప్రభావిత ప్రాంతాల వెలుపల వెలుపల ఉన్న ప్రావిన్స్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తింపు తెలియని వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఫొటోలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు కోకా తెలిపారు.
మరో వైపు ప్రపంచదేశాల నుంచి సహాయ, సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. భారత్ శనివారం ‘ఆపరేషన్ దోస్త్’ను ప్రారంభించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు భారత బలగాలు తమవంతు కృషి చేస్తాయని ప్రధాని మోదీ ఓ ట్వీట్‌లో తెలిపారు. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేలో భారత బృందాలు పగలూ, రాత్రి పని చేస్తున్నామని ప్రధారి పేర్కొన్నారు. జీవితాలను కాపాడేందుకు తమవంతు కృషిని కొనసాగిస్తున్నాయన్నారు. క్లిష్ట సమయంలో తుర్కియేకు భారత్ అండగా నిలుస్తుందన్నారు.
ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను ట్వీట్ చేశారు. తుర్కియేలోని ఇస్కెండరున్‌లోని ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌లో ఇప్పటివరకు 106 మందికిపైగా చికిత్స పొందారని అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్ దోస్త్’ పేరు కింద తుర్కియే, సిరియాలకు భారత్ 841 కార్టన్‌ల మందులు, భద్రతా పరికరాలను పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 6.1 టన్నుల బరువున్న 841 కార్టన్‌ల మెడిసిన్, సేఫ్టీ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, డయాగ్నోస్టిక్స్‌ను భారత్ పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతవారంలో తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపాలకు భారీగా భవనాలు నేలకూలిన విషయం తెలిసిందే.
భారీ ప్రకంపనల ధాటికి 24వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో భారత్ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను టుర్కియేకు పంపింది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఈ బృందాలు 24×7 పని చేస్తుంది. భూకంపం తాకిడికి గురైన తుర్కియేలో కూలిన భవనం శిథిలాల నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎనిమిదేళ్ల బాలికను రక్షించారు. గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి పట్టణంలో ఎన్డీఆర్‌ఎఫ్, తుర్కియే ఆర్మీ సిబ్బందితో కలిసి ఆపరేషన్ నిర్వహించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు.