Walmart | బిలియ‌నీర్ ప‌డ‌వ‌కు రంగు ప‌డింది.. నిర‌స‌న‌కారుల ఆగ్ర‌హం, అరెస్టు

Walmart విధాత‌: స‌ర‌కు స‌రఫ‌రా వ్య‌వ‌స్థ‌లో రారాజుగా ఉన్న సంస్థ వాల్‌మార్ట్‌ (Walmart). ఆ సంస్థ వార‌సురాలికి చెందిన సుమారు రూ.2465 కోట్ల విలువైన సూప‌ర్ యాట్ (విలాసవంత‌మైన ప‌డ‌వ‌)పై ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు క‌న్నెర్ర చేశారు. స్పెయిన్‌లోని ఇబిజా తీరంలో లంగ‌రేసి ఉన్న నాన్సీ వాల్‌మార్ట్‌కు చెందిన తెల్ల‌టి హంస లాంటి ప‌డ‌వ‌పై పెయింట్ పూసేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఫ్యుచురో వెజిట‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ గ్రూప్ ట్విట‌ర్‌లో ఆదివారం పోస్ట్ చేసింది. ఇందులో ఇద్ద‌రు నిర‌స‌నకారులు యాట్‌ […]

Walmart | బిలియ‌నీర్ ప‌డ‌వ‌కు రంగు ప‌డింది.. నిర‌స‌న‌కారుల ఆగ్ర‌హం, అరెస్టు

Walmart

విధాత‌: స‌ర‌కు స‌రఫ‌రా వ్య‌వ‌స్థ‌లో రారాజుగా ఉన్న సంస్థ వాల్‌మార్ట్‌ (Walmart). ఆ సంస్థ వార‌సురాలికి చెందిన సుమారు రూ.2465 కోట్ల విలువైన సూప‌ర్ యాట్ (విలాసవంత‌మైన ప‌డ‌వ‌)పై ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు క‌న్నెర్ర చేశారు. స్పెయిన్‌లోని ఇబిజా తీరంలో లంగ‌రేసి ఉన్న నాన్సీ వాల్‌మార్ట్‌కు చెందిన తెల్ల‌టి హంస లాంటి ప‌డ‌వ‌పై పెయింట్ పూసేశారు.

దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఫ్యుచురో వెజిట‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ గ్రూప్ ట్విట‌ర్‌లో ఆదివారం పోస్ట్ చేసింది. ఇందులో ఇద్ద‌రు నిర‌స‌నకారులు యాట్‌ (Yacht) వ‌ద్ద నుంచుని మీరు ఉప‌య‌గిస్తారు.. ఇత‌రులు ఇబ్బంది ప‌డ‌తారు అనే ప్ల‌కార్డును ప‌ట్టుకున్నారు. మేము ఈ యాచ్‌కి పెయింట్ కొట్టేశాం. రూ.2465 కోట్ల ఈ అతి విలాస‌వంత‌మైన ఈ యాట్‌.. వాల్‌మార్ట్ వార‌సురాలు, రూ.71,468 కోట్లతో అత్యంత ధ‌న‌వంతురాలైన నాన్సీ వాల్‌మార్ట్‌కు చెందిన‌ది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.