Site icon vidhaatha

Crime | బ‌ల‌వంతంగా మూత్రం తాగించి.. మ‌ల‌ద్వారంలో ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు చొప్పించి..

Crime | కొంద‌రు వ్య‌క్తులు క్రూర‌మృగ‌ల్లా, నీచాతినీచంగా ప్ర‌వ‌ర్తించారు. ఇద్ద‌రు మైన‌ర్ల‌కు బ‌ల‌వంతంగా మూత్రం తాగించి, వారి మ‌ల‌ద్వారంలో ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు చొప్పించి పైశాచిక ఆనందం పొందారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సిద్ధార్థ్ న‌గ‌ర్‌లో ఈ నెల 4వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రానికి చెందిన 10, 15 ఏండ్ల బాలురు ఇద్ద‌రు డ‌బ్బు దొంగ‌త‌నం చేశార‌ని ఆరోపిస్తూ కొంద‌రు వ్య‌క్తులు వారిని ప‌ట్టుకున్నారు. ఇక వీరిద్ద‌రిని ఓ చోట నిర్బంధించి వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డారు. మాన‌సికంగా, శారీర‌కంగా హింసించారు. బ‌ల‌వంతంగా మూత్రం తాగించారు.

అంత‌టితో ఆగ‌కుండా వారి మ‌ల‌ద్వారంలో ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు చొప్పించి, పైశాచిక ఆనందం పొందారు. మిర‌ప‌కాయ‌లు కూడా తినిపించారు. కారంతో వారు అల్లాడిపోతుంటే.. తాగేందుకు బాటిళ్ల‌లో మూత్రం నింపి ఇచ్చారు. మూత్రం తాగ‌క‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు. బాధ‌తో వారు ఏడుస్తుంటే రాక్ష‌సానందం పొందారు.

ఈ దారుణాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు జిల్లా అద‌న‌పు ఎస్‌పీ తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌బోమ‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version