Hyderabad | హైద‌రాబాద్‌ శివారులో కారు బీభ‌త్సం.. త‌ల్లీకూతురు దుర్మ‌రణం

Hyderabad | హైద‌రాబాద్ శివారులోని బండ్ల‌గూడ‌లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల‌కు మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌ను అనురాధ‌(38), మ‌మ‌త‌(26)గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రు త‌ల్లీకూతుళ్లు అని తెలిపారు. ఇక గాయ‌ప‌డిన మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి కార‌ణం అతి […]

Hyderabad | హైద‌రాబాద్‌ శివారులో కారు బీభ‌త్సం.. త‌ల్లీకూతురు దుర్మ‌రణం

Hyderabad | హైద‌రాబాద్ శివారులోని బండ్ల‌గూడ‌లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల‌కు మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌ను అనురాధ‌(38), మ‌మ‌త‌(26)గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రు త‌ల్లీకూతుళ్లు అని తెలిపారు. ఇక గాయ‌ప‌డిన మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌మాదానికి కార‌ణం అతి వేగ‌మే అని స్థానికులు పేర్కొన్నారు. మార్నింగ్ వాక‌ర్స్‌ను ఢీకొట్టిన కారు నంబ‌ర్ ఏపీ 09 బీజే 2588. కారు డ్రైవ‌ర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.