Two Youths Die: ఈత సరదాకు ఇద్దరు యువకుల బలి.!

ఈత సరదా ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొనగా..అదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లోని హల్దార్ పీఎస్ పరిధిలోని ఝాలు కాలువ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

  • By: Somu |    latest |    Published on : Apr 20, 2025 1:47 PM IST
Two Youths Die: ఈత సరదాకు ఇద్దరు యువకుల బలి.!

Two Youths Die: ఈత సరదా ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొనగా..అదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లోని హల్దార్ పీఎస్ పరిధిలోని ఝాలు కాలువ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈత కోసమని ముగ్గురు యువకులు కాలువలో దూకారు. సరదాగా ఈత కొడుతున్న తరుణంలో నీటి ప్రవాహం పెరిగిపోయి అలుగు మీద నుంచి కిందకు జారిపోయారు. భారీ నీటి ప్రవాహానికి తోటి యువకులు చూస్తుండగానే కొట్టుకెళ్లి పోయారు.

ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడ్డాడు. భారీ నీటి ప్రవాహానికి చూస్తుండగానే యువకులు కొట్టుకపోయి ప్రాణాలు కోల్పోవడంతో వెంట ఉన్న మిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.