విధాత: వీర సావర్కర్‌ని కించపరిచేలా మాట్లాడవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే సూచించారు. సావర్కర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో చీలకలు వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నామని ఇలాంటి వ్యాఖ్యలతో దూరం పెంచవద్దని ఉద్ధవ్ హితవు పలికారు.
హిందుత్వ సిద్ధాంతం విషయంలో సావర్కర్ తమకు స్ఫూర్తి అని, ఆయనను త్యాగానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. 14 ఏండ్లు అండమాన్ జైలులో సావర్కర్ చిత్రహింసలు అనుభవించిన విషయాన్ని ఉద్ధవ్ గుర్తుచేశారు. సావర్కర్‌ను తాము ఆరాధ్యదైవంగా భావిస్తామన్నారు. ఆయనను అవమానించడం మానుకోవాలని సూచించారు.