Ukrainian | రష్యన్‌ ప్రతినిధిని చితకబాదిన ఉక్రెయిన్‌ ఎంపీ.. వీడియో వైరల్‌

విధాత : రష్యా, ఉక్రెయిన్‌ (Ukrainian) మధ్య యుద్ధం, రెండు దేశాల నాయకుల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నాయి. పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్‌ కుట్ర చేసిందని, ఇది అమెరికా అదుపాజ్ఞల్లోనే జరిగిందని రష్యా ఆరోపించడమే కాదు.. ఏకంగా జెలెన్స్కీని హతమార్చడం మినహా తమకు మరో మార్గం లేదని ఆ దేశ భద్రతా వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఒకరిని చూస్తే ఒకరు అగ్గిమీద గుగ్గిలం […]

  • By: Somu    latest    May 05, 2023 12:00 PM IST
Ukrainian | రష్యన్‌ ప్రతినిధిని చితకబాదిన ఉక్రెయిన్‌ ఎంపీ.. వీడియో వైరల్‌

విధాత : రష్యా, ఉక్రెయిన్‌ (Ukrainian) మధ్య యుద్ధం, రెండు దేశాల నాయకుల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నాయి. పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్‌ కుట్ర చేసిందని, ఇది అమెరికా అదుపాజ్ఞల్లోనే జరిగిందని రష్యా ఆరోపించడమే కాదు.. ఏకంగా జెలెన్స్కీని హతమార్చడం మినహా తమకు మరో మార్గం లేదని ఆ దేశ భద్రతా వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఒకరిని చూస్తే ఒకరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా అంకారాలో జరిగిన బ్లాక్‌సీ దేశాల సమావేశంలో రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్‌ మంత్రి ఒకరు పిడిగుద్దులు కురిపించారు. టర్కీ పార్లమెంటు తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి. ఒలెక్సాండర్‌ మరికోవ్‌స్కీ అనే ఉక్రెయిన్‌ ఎంపీ సమావేశం సందర్భంగా తన దేశ పతాకాన్ని చేతపట్టకుని ఉన్నాడు. ఆ సమయంలో రష్యా ప్రతినిధి వలెరీ స్టావిట్‌స్కీ.. దగ్గరకు వచ్చి ఎంపీ చేతిలోని పతాకాన్ని లాగేస్తాడు.

దీంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. తోటి ప్రతినిధులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీయాల్సి వచ్చింది. దెబ్బలు తిన్న రష్యన్‌ ప్రతినిధిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు 14 నెలలుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్నది. అదే స్థాయిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నానాటికి పెరుగుతున్నది.

ఆ ఫలితంగానే ఇరువురు ప్రతినిధులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనకు ముందే ఇదే సమావేశంలో ఉక్రెయిన్‌ ప్రతినిధులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. రష్యా ప్రతినిధుల సమీపంలో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందుకు అభ్యతరం పెట్టడం ఈ ఘర్షణకు కారణమైంది.