పాప ఆచూకీ అడిగితే.. చెంప ఛెల్లుమనిపించిన ఎస్ఐ.. వీడియో
విధాత: అదృశ్యమైన తన మేన కోడలు ఆచూకీ తెలుసుకునేందుకు వెళ్లిన వ్యక్తి పట్ల ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు స్టేషన్‌లో అందరి ముందు ఆ వ్యక్తిపై ఎస్ఐ దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి చెంప ఛెల్లుమనిపించాడు ఎస్ఐ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బాగ్‌పట్ జిల్లాలోని బినౌలి పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి అదృశ్యమైంది. ఎంత వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు […]

విధాత: అదృశ్యమైన తన మేన కోడలు ఆచూకీ తెలుసుకునేందుకు వెళ్లిన వ్యక్తి పట్ల ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు స్టేషన్‌లో అందరి ముందు ఆ వ్యక్తిపై ఎస్ఐ దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి చెంప ఛెల్లుమనిపించాడు ఎస్ఐ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బాగ్‌పట్ జిల్లాలోని బినౌలి పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి అదృశ్యమైంది. ఎంత వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు పురోగోతి గురించి తెలుసుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులు పీఎస్‌కు వెళ్లారు.
అయితే స్టేషన్ ఇంచార్జి ఎస్ఐ బిర్జా రామ్.. ఓ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కేసు పురోగతి వివరాలు చెప్పకుండా.. ఆ పాప మామపై చేయి చేసుకున్నాడు ఎస్ఐ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. బిర్జా రామ్‌ను బదిలీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.