భార్య, పిల్లలను చంపి డాక్టర్ ఆత్మహత్య
ఓ వైద్యుడు భార్య, ఇద్దరు బిడ్డలను చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది
- యూపీలోని రాయ్‌బరేలీలో దారుణం
- మానసిక ఒత్తిడితోనే దుశ్చర్య: ఎస్పీ
విధాత: ఓ వైద్యుడు భార్య, ఇద్దరు బిడ్డలను చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్ ప్రాంతంలో ఉన్న మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ సింగ్ పనిచేస్తున్నారు. ఆయన కంటి వైద్య నిపుణుడు. అయితే, అరుణ్ కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.
గత ఆదివారం నుంచి ఈ కుటుంబ సభ్యులు ఎవరూ సమీపంలోని ఎవరితోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు. మంగళవారం ఇంజక్షన్లు ఇచ్చి భార్య, బిడ్డలను (14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబు) అపస్మారక స్థితిలోకి పంపించారు. అనంతరం వారిని తలలపై కొట్టి చంపేశారు. ఆ తర్వాత అరుణ్ కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram