UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు..! ఆగస్టులో రూ.15లక్షల కోట్ల విలువైన లావాదేవీలు..!
UPI Payments | డిజిటల్ చెల్లింపులో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు ఉధృతమయ్యాయి. ప్రతి ఒక్కరి వద్ద ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండగా.. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం తదితర పేమెంట్స్ యాప్‌ను వినియోగిస్తున్నారు. వీటిలో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ సహాయంతోనే పేమెంట్స్ వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు గత నెల ఆగస్టులో యూపీఐ ద్వారా లావాదేవీలు భారీగా పెరిగాయి. పది బిలియన్లకుపైగా […]

UPI Payments |
డిజిటల్ చెల్లింపులో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు ఉధృతమయ్యాయి. ప్రతి ఒక్కరి వద్ద ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండగా.. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం తదితర పేమెంట్స్ యాప్‌ను వినియోగిస్తున్నారు. వీటిలో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ సహాయంతోనే పేమెంట్స్ వేగంగా జరుగుతున్నాయి.
మరో వైపు గత నెల ఆగస్టులో యూపీఐ ద్వారా లావాదేవీలు భారీగా పెరిగాయి. పది బిలియన్లకుపైగా లావాదేవీలు జరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ టెక్నాలజీ (UPI)ని తీసుకువచ్చిన ఏడేళ్లలో ఒకే నెలలో ఇంత మొత్తంలో లావాదేవీలు జరుగడం ఇదే తొలిసారి.
ఈ లావాదేవీల విలువ రూ.15లక్షల కోట్లు. యూపీఐ ద్వారా రోజుకు రూ.300కోట్ల చెల్లింపులు చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని యూపీఐ సీఈవో దిలీప్ అస్బే గతంలో ప్రకటించారు. సరైన పెట్టుబడులతో ఇదేమీ అసాధ్యం కాదన్న విషయం విధితమే. అయితే, లావాదేవీలు 10 బిలియన్లకు చేరుకున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ లైన్ ఇండియా స్ట్రాటజీ, ఇన్నోవేషన్, అనలిటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ రొంగాల పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో పీ2ఎం లావాదేవీలే యూపీ లావాదేవీల పెరుగుదలకు ఊతంగా నిలుస్తాయని, మరో 18-20 నెలల్లో యూపీఐ లావాదేవీలు నెలకు 20 బిలియన్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం పీర్ టు పీర్, మర్చంట్ లావాదేవీలను పక్కన పెడితే ఐపీవో, యూపీఐ క్రెడిట్ యూపీఐని వాడుతున్నారు. ఇక ఫీచర్ ఫోన్ల కోసం ఎన్‌పీఐసీఐ ఇప్పటికే యూపీఐ123Payని తీసుకువచ్చింది. ఇక విదేశాలకు విస్తరిస్తుండగా.. యూపీఐ లావాదేవీలు కొత్త శిఖరాలను అందుకోనున్నాయి.
ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, యూఏసీ, శ్రీలంక, బహ్రెయిన్‌లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం 20కోట్ల మంది భారతీయులు యూపీఐ సాంకేతికను వాడుతుండగా.. కొన్నేళ్లలో మూడురెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. దేశంలో 15కోట్ల మర్చంట్స్‌లో కేవలం 5కోట్ల మంది మాత్రమే యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు.
వీరిలో నుంచి 3శాతం పెరుగనున్నారు. ఇందుకు మరిన్ని పేమెంట్స్ అప్లికేషన్స్ అవసరమని నిపుణులు భావిస్తున్నారు. సరైన పెట్టుబడులు వస్తే అప్లికేషన్స్ పెద్ద కష్టం కాదని, యూపీఐలో వ్యాపారంలోకి అడుగుపెట్టే వారికి నిబంధనలు సులభతరం చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే, గూగుల్‌పేదే ఆదిపత్యం కొనసాగుతున్నాయి. 80 నుంచి 90 శాతం వరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. జులైలో ఫోన్‌పే ద్వారా రూ.7.61 లక్షల కోట్ల విలువైన 4.7 బిలియన్ల లావాదేవీలు జరగ్గా.. గూగుల్ పేలో రూ.5.2 లక్షల కోట్ల విలువైన 3.5 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.