Subhash Reddy | కారు దిగిన భేతి సుభాష్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆరెస్‌కు మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆరెస్‌కు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు
ఈటల గెలుపుకు పనిచేస్తానని వెల్లడి
విధాత: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆరెస్‌కు మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆరెస్‌కు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని, ఇటీవల మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చించకుండా ఇచ్చారని తప్పుబట్టారు. బీఆరెస్ టికెట్ ఇచ్చిన అవకాశవాది కంటే ఉద్యమ సహచరుడు ఈటలకు మద్దతుగా ఆయనను గెలిపించుకోవాలనుకుంటున్నానని, అందుకే బీఆరెస్‌కు రాజీనామా చేస్తున్నానని లేఖలో సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram