Bhumi Sunil Kumar | ఊరికో ‘సాగు న్యాయ నేస్తం’: లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ కుమార్
Bhumi Sunil Kumar | విధాత: రైతులకు న్యాయ సలహాలు అందించడానికి ప్రతి ఊరిలో ఒక రైతుకు చట్టాలపై శిక్షణ ఇచ్చి సాగు న్యాయ నేస్తంగా తయారు చేయాలని నిర్ణయించినట్లు లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమి, వ్యవసాయానికి సంబంధించి రైతుల న్యాయ పరమైన అవసరాలను తీర్చే ప్రయత్నాలు తమ సంస్థ చేస్తుందన్నారు. రైతుల కోసం భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాగు న్యాయం కార్యక్రమం ద్వారా […]
Bhumi Sunil Kumar |
విధాత: రైతులకు న్యాయ సలహాలు అందించడానికి ప్రతి ఊరిలో ఒక రైతుకు చట్టాలపై శిక్షణ ఇచ్చి సాగు న్యాయ నేస్తంగా తయారు చేయాలని నిర్ణయించినట్లు లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమి, వ్యవసాయానికి సంబంధించి రైతుల న్యాయ పరమైన అవసరాలను తీర్చే ప్రయత్నాలు తమ సంస్థ చేస్తుందన్నారు.
రైతుల కోసం భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాగు న్యాయం కార్యక్రమం ద్వారా వారికి ఉచిన న్యాయ సేవలు అందిస్తున్నామని, భూ న్యాయ శిబిరాలను నిర్వహిస్తూ రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు. ప్రతి వారం న్యాయ గంట కార్యక్రమం నిర్వహించి రైతులకు ఫోన్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, న్యాయ సేవల అథారిటీలతో కలిసి రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించే కార్యక్రమాలు కూడా చేస్తున్నామన్నారు. ఇప్పటికే వెయ్యిమందికి పైగా గ్రామీణ యువతకు సాగు న్యాయ నేస్తాలుగా శిక్షణ ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రతి గ్రామంలో ఒక రైతుకు భూమి, వ్యవసాయ చట్టాలపై ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు.
అర్హతలు.. దరఖాస్తులు
భూమి సాగు చేస్తున్న రైతు లేదా కౌలు రైతు అయ్యి ఉండాలి. గ్రామంలో నివాసం ఉండాలి. చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి. వలంటీర్ గా రైతులకు సహాయం అందించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. లీఫ్స్ నిర్వహించే శిక్షణా తరగతులకు తప్పక హాజరు కావాలి దరఖాస్తుదారుల పేరు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, విద్యార్హతలు, కాంటాక్ట్ నెంబర్ వివరాలను వాట్సాప్ ద్వారా 9000222674 నంబర్ కు 30 జూన్ 2023 లోగా పంపించాలని, ఎంపికైన వారికి లీఫ్స్ సంస్థ ఫోన్ చేసి శిక్షణ, ఇతర వివరాలను తెలియజేస్తుందని భూమి సునీల్ కుమార్ తెలిపారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram