పరుగులు తీయనున్న వందేభారత్ వీక్లీ స్పెషల్ రైలు.. ఏ మార్గంలో పరుగులు తీస్తుందంటే..?
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నది.

విధాత: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నది. దాదాపు 30కిపైగా సర్వీసులు వివిధ నగరాల మధ్య నడుస్తున్నాయి. అయితే, తొలిసారిగా వందే భారత్ వీక్లీ స్పెషల్ రైళ్లను సైతం నడుపబోతున్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చెన్నై సెంట్రల్ – మైసూర్ మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
రైలు నంబర్ 06037 చెన్నై సెంట్రల్ – మైసూరు వందేభారత్ స్పెషల్ ఈ నెల 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 5.50 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు మైసూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మైసూరు నుంచి మధ్యాహ్నం 1.05 గంటలకు బయలుదేరి రాత్రి 7.20 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాట్పాడి, కేఎస్‌ఆర్ బెంగుళూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ రైల్వే వివరించింది.