వీరసింహారెడ్డి.. కన్నడ ‘మప్టీ’ రిమేకా! అడ్డంగా బుక్ చేసిన బాలయ్య..!
విధాత, సినిమా: నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన గోపీచంద్ మలినేనితో చేసిన వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతికి విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య స్థాయిలో కాకపోయినా ఓ స్థాయిలో బాలయ్యకు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. బాలయ్య నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో గోపీచంద్ మలినేని పొందుపరిచి సినిమాలో అద్భుతమైన ఎలివేషన్స్ ఇచ్చి మంచి విజయం నమోదు చేశారు. వీరసింహారెడ్డి కన్నడ మఫ్టీకి రీమేక్ అంటూ బాగా […]

విధాత, సినిమా: నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన గోపీచంద్ మలినేనితో చేసిన వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతికి విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య స్థాయిలో కాకపోయినా ఓ స్థాయిలో బాలయ్యకు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. బాలయ్య నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో గోపీచంద్ మలినేని పొందుపరిచి సినిమాలో అద్భుతమైన ఎలివేషన్స్ ఇచ్చి మంచి విజయం నమోదు చేశారు.
వీరసింహారెడ్డి కన్నడ మఫ్టీకి రీమేక్ అంటూ బాగా వార్తలు మొదలయ్యాయి. అయితే దర్శకుడు ఆ వార్తలను ఖండించారు. ఆ సినిమాకు తమ వీరసింహారెడ్డికి ఎలాంటి పోలికలు లేవని తేల్చిచెప్పారు. కానీ ఈ విషయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని అబద్దం చెప్పాడని తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. దీనికి ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేశాడు
కానీ వీరసింహారెడ్డి శివరాజ్ కుమార్ నటించిన మఫ్టీకి స్ఫూర్తి అని స్వయంగా బాలయ్య ఒప్పుకున్నారు. దాంతో గోపీచంద్ మలినేని అడ్డంగా బుక్కయ్యారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన వేద మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ శివరాజ్ కుమార్‌తో తమకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అంతేకాకుండా ఆయన నటించిన మఫ్టీ చిత్రం నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో శివరాజ్ కుమార్ టైప్ క్యారెక్టర్‌ని చూసే వీర సింహారెడ్డి పాత్రను డిజైన్ చేసుకున్నామని అసలు సీక్రెట్ బయటపెట్టారు.
శివరాజ్ కుమార్ నటించిన మఫ్టీ కూడా సిస్టర్ సెంటిమెంటుతో నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో శివరాజ్ కుమార్‌తో పాటు శ్రీమురళి కూడా నటించాడు. నర్తన్ ఈ సినిమాకి దర్శకుడు. ఆ మూవీ ఛాయలోనే వీర సింహారెడ్డి కూడా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగిన కథే ఐనా కొత్త ట్రీట్మెంట్‌తో నడిపించారు.
వాల్తేరు వీరయ్యతో పోటీపడిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల షేర్‌ని రాబట్టింది. కాబట్టి బాలయ్య సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచిపోయింది. తాజాగా బాలయ్య బయటపెట్టిన సీక్రెట్‌తో ఇప్పుడు గోపీచంద్ మల్లినేని అడ్డంగా బుక్కయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.