Uttar Pradesh | మద్యం మత్తులో గిరిజనుడి చెవిలో మూత్రం పోసిన వ్యక్తి..
Uttar Pradesh | ఓ ఇద్దరు పీకల దాకా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి చెవిలో మూత్రం పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సోనభద్ర జిల్లా జుగేల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఘటియా గ్రామానికి చెందిన జవహీర్ పటేల్, గులాబ్‌కోర్ ఇద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరు జులై 11వ తేదీన రాత్రి మద్యం […]
Uttar Pradesh | ఓ ఇద్దరు పీకల దాకా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి చెవిలో మూత్రం పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సోనభద్ర జిల్లా జుగేల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఘటియా గ్రామానికి చెందిన జవహీర్ పటేల్, గులాబ్‌కోర్ ఇద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరు జులై 11వ తేదీన రాత్రి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన జవహీర్ పటేల్.. గులాబ్ చెవిలో మూత్రం పోశాడు. మద్యం మత్తులో ఉన్న గులాబ్ ఈ ఘటనను గమనించలేదు.
అక్కడే ఉన్న మరొకరు ఈ ఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. తనకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్న గులాబ్.. జవహీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జవహీర్, గులాబ్‌ను ఇద్దరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జవహీర్ పటేల్ వర్గానికి చెందిన వ్యక్తి కాగా, గులాబ్ గిరిజనుడు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram