Viral Video | తల్లి చిరుతపులితో.. పిల్ల పులి ఆట చూశారా?

Viral Video విధాత: అమ్మలతో ఆటాడుకోవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు? మనుషులైనా, జంతువులైనా.. తల్లీపిల్లల బంధం ఒక ప్రత్యేకం. అలాంటి అనుబంధాన్ని తెలిపే ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నది. పడుకుని ఉన్న తల్లిపైకి ఎక్కి.. తల్లి తోకతో ఆ పిల్ల చిరుతపులి చేస్తున్న చేష్టలు ఎంతో హృద్యంగా ఉన్నాయి. ఐఏఎస్‌ అధికారి ఎంవీ రావు ఈ వీడియోను ట్వట్టర్‌లో పోస్ట్‌ చేశారు. బుధవారం అంతర్జాతీయ చిరుతపులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక మంది చిరుతపులలకు సంబంధించిన […]

Viral Video | తల్లి చిరుతపులితో.. పిల్ల పులి ఆట చూశారా?

Viral Video

విధాత: అమ్మలతో ఆటాడుకోవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు? మనుషులైనా, జంతువులైనా.. తల్లీపిల్లల బంధం ఒక ప్రత్యేకం. అలాంటి అనుబంధాన్ని తెలిపే ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నది. పడుకుని ఉన్న తల్లిపైకి ఎక్కి.. తల్లి తోకతో ఆ పిల్ల చిరుతపులి చేస్తున్న చేష్టలు ఎంతో హృద్యంగా ఉన్నాయి.

ఐఏఎస్‌ అధికారి ఎంవీ రావు ఈ వీడియోను ట్వట్టర్‌లో పోస్ట్‌ చేశారు. బుధవారం అంతర్జాతీయ చిరుతపులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక మంది చిరుతపులలకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇదే క్రమంలో ఎంవీరావు తల్లి పులితో పిల్ల పులి ఆటలాడుకుంటున్న వీడియోను పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోలో ఒక చిన్నారి చిరుతపులి తన తల్లిపైకి ఎక్కి అల్లరి చేస్తూ ఉంటుంది. తోకను పట్టుకుని కొరికేందుకు ప్రయత్నిస్తుంది. ఏం చేయగలగవో నేనూ చూస్తా అన్నట్టు ఆ తల్లి చిరుతపులి అటూ ఇటూ తిరుగుతుంది. కాసేపటికి తన దగ్గరకు తీసుకుంటుంది.