Vijayasai Reddy | చాన్నాళ్లకు.. కనిపించిన విజయ సాయి

విధాత‌: గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అని ఎవరో హీరో అన్నట్లుగా.. ఈమధ్య పొలిటికల్ గ్యాప్ వచ్చిన విజయసాయి రెడ్డి మళ్లీ లైన్‌లోకి వచ్చారు. అప్పట్లో ఈనాడు రామోజీ రావు, చంద్రబాబు, రాధాకృష్ణ, లోకేష్ తదితరుల మీద ట్విట్టర్, ఫెసుబుక్కు పోస్టులతో దాడి చేసే విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ మధ్య వెనుకబడ్డారు. ఆయన్ను జగన్ వెనక్కి నెట్టేశారని కొందరు, లేదు ఆయనే వేరే కారణాలతో కాస్త సైలెంట్ అయ్యారని కొందరు. అలాకాదు కొన్నాళ్ళు కామ్‌గా […]

  • By: Somu    latest    May 29, 2023 10:32 AM IST
Vijayasai Reddy | చాన్నాళ్లకు.. కనిపించిన విజయ సాయి

విధాత‌: గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అని ఎవరో హీరో అన్నట్లుగా.. ఈమధ్య పొలిటికల్ గ్యాప్ వచ్చిన విజయసాయి రెడ్డి మళ్లీ లైన్‌లోకి వచ్చారు. అప్పట్లో ఈనాడు రామోజీ రావు, చంద్రబాబు, రాధాకృష్ణ, లోకేష్ తదితరుల మీద ట్విట్టర్, ఫెసుబుక్కు పోస్టులతో దాడి చేసే విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ మధ్య వెనుకబడ్డారు. ఆయన్ను జగన్ వెనక్కి నెట్టేశారని కొందరు, లేదు ఆయనే వేరే కారణాలతో కాస్త సైలెంట్ అయ్యారని కొందరు. అలాకాదు కొన్నాళ్ళు కామ్‌గా ఉండమని జగన్ చెప్పారని ఇంకొందరు ఎవరికీ నచ్చిన వ్యాఖ్యానం వారు చెప్పుకున్నారు.

అయితే మొత్తానికి ఏమైందో కానీ ఆ తరువాత కొన్నాళ్ళు సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉన్న విజయ్ సాయి రెడ్డి కేంద్రాన్ని పొగిడే పని పెట్టుకున్నారు. సందర్భాన్ని బట్టి మోడీని, కేంద్రాన్ని మోస్తూ పోస్టులు పెట్టడం మొదలెట్టారు. దీన్ని చూసిన కొందరు ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారని, ఇక జగన్‌కు దూరం అవుతారని కూడా అపోహ పడ్డారు.

మొత్తానికి లేటుగా వస్తే వచ్చారు గానీ నిన్నటి చంద్రబాబు మేనిఫెస్టో చూసి కలుగులోచి వచ్చిన ముంగిస మాదిరి మళ్ళీ బుసలు కొట్టారు. ఆ మ్యానిఫెస్టో అంతా బూటకం అని, ఎలాగూ మ్యానిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేస్తారు కాబట్టి ఇలా తప్పుడు హామీలు ఎన్ని అయినా ఇవ్వొచ్చు అని ఎద్దేవా చేసారు. దీంతో ఓహో అయన మళ్లీ యాక్టివ్ అయ్యారా అని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు.