Site icon vidhaatha

SI Video Viral | బీరు సీసాతో ఎస్సై హల్‌చల్‌.. వీడియో వైరల్

SI Video Viral

విధాత బ్యూరో, కరీంనగర్: మద్యం బాటిల్‌తో సామాజిక మాధ్యమాలకెక్కిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఎస్సై వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మొన్న చనిపోతానంటూ ఓ వీడియో విడుదల చేసిన ఎస్సై బోయిని పరశురాములు.. ఆదివారం రోజు ఏకంగా మద్యం బాటిల్ తో ఓ వీడియో విడుదల చేశారు. ఇష్టారీతిన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోల విడుదల చేయడంతో.. పరశురామ్ ను ఎరిగిన తోటి సిబ్బంది నివ్వెరపోతున్నారు.

పరశురామ్ ప్రస్తుతం సిరిసిల్ల సీసీఎస్ లో పనిచేస్తున్నారు. గతంలో కోనరావుపేటలో దురుసుగా వ్యవహరించి సస్పెన్షన్ కు కూడా గురైన ఎస్సై పరశురామ్ సోషల్ మీడియా వీడియోస్ పై.. ఇప్పుడు ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. అయితే, పరశురామ్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే.. ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడనే మరో వాదన వినిపిస్తోంది.

Exit mobile version