Viral Video | సలసల కాగుతున్న వేడి నూనె.. చేతులతోనే చేపలను దేవాడు..
Viral Video | ఇంట్లో వంట చేసినప్పుడు వేడి నూనె కాస్త చేతులపై పడిపోతేనే అల్లాడిపోతాం. గాయం ఎక్కువైతే హాస్పిటల్‌కు పరుగెడుతాం. కానీ ఈ వ్యక్తి మాత్రం సలసల కాగుతున్న వేడి నూనెలో ఏకంగా తన చేతి వేలను ఉంచాడు. నూనెలో మరుగుతున్న చేప వడలను తన వేళ్లతో బయటకు తీశాడు. ఇది మీకు ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ పెద్దాయన రోడ్డు సైడ్ […]
Viral Video |
ఇంట్లో వంట చేసినప్పుడు వేడి నూనె కాస్త చేతులపై పడిపోతేనే అల్లాడిపోతాం. గాయం ఎక్కువైతే హాస్పిటల్‌కు పరుగెడుతాం. కానీ ఈ వ్యక్తి మాత్రం సలసల కాగుతున్న వేడి నూనెలో ఏకంగా తన చేతి వేలను ఉంచాడు. నూనెలో మరుగుతున్న చేప వడలను తన వేళ్లతో బయటకు తీశాడు. ఇది మీకు ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఓ పెద్దాయన రోడ్డు సైడ్ చేప వడల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతను వేడి నూనెలోనూ తన చేతి వేళ్లను పెట్టగలడు. చేపలను దేవడానికి అందరూ ఇతర సామాగ్రిని ఉపయోగిస్తే.. ఈయన మాత్రం తన చేతి వేళ్లకు పని చెబుతున్నాడు. వేడి వేడి నూనెలో మరుగుతున్న చేప వడలను తన చేతి వేళ్లతో అలవోకగా బయటకు తీసి, మరో పాత్రలో వేస్తున్నాడు.
ఈ వీడియోను 4.3 మిలియన్ల మంది వీక్షించగా, పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వండర్ ఫుల్ అని కొందరు అభినందింస్తుంటే, మరికొందరేమో తమ అమ్మమ్మ, నానమ్మలను గుర్తు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆ కుక్ దైర్య సాహసాలకు మెచ్చుకోవాల్సిందే.
His fingertips tough af pic.twitter.com/z6Dk2RS3OF
— Mesh
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram