Virat Kohli: 1673 రోజుల నుండి అభిమానుల ఎదురు చూపులు.. ఈ సారైన ఫలించేనా..!
Virat Kohli: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో పెద్దగా ప్రదర్శన కనబచరడం లేదు.ఒకప్పుడు వరుస సెంచరీలతో వీరవిహారం చేసిన కోహ్లీ ఇప్పుడు మాత్రం సెంచరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీ చేస్తాడని అందరు అనుకున్నప్పటికీ అటువైపుగా ముందుకు సాగలేకపోయాడు డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు సెంచరీలు చేసిన కూడా విరాట్ కోహ్లీ మాత్రం సెంచరీ చేయలేకోపోయాడు. […]

Virat Kohli: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో పెద్దగా ప్రదర్శన కనబచరడం లేదు.ఒకప్పుడు వరుస సెంచరీలతో వీరవిహారం చేసిన కోహ్లీ ఇప్పుడు మాత్రం సెంచరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీ చేస్తాడని అందరు అనుకున్నప్పటికీ అటువైపుగా ముందుకు సాగలేకపోయాడు డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు సెంచరీలు చేసిన కూడా విరాట్ కోహ్లీ మాత్రం సెంచరీ చేయలేకోపోయాడు. 182 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 5 ఫోర్లతో 76 పరుగులకి ఔటయ్యాడు.
రహీం కార్న్‌వాల్ వేసిన బంతిలో అతానాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు కోహ్లీ. విరాట్ కోహ్లీకి విదేశాల్లో సెంచరీ లేక ఐదేళ్లు అయింది. అతను 2018లో చివరిసారిగా విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అదే మ్యాచ్‌లో 257 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 123 పరుగులు చేశాడు. భారత్ వెలుపల కింగ్ కోహ్లీ టెస్టు సెంచరీ చేసి 1673 రోజులు గడిచాయి. ఆయన సెంచరీ మళ్లీ ఎప్పుడు చేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజులలో విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో 2వ టెస్టు మ్యాచ్‌ను ఎదుర్కొనున్నాడు. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న 2వ టెస్టు మ్యాచ్‌లో అయితన విదేశీ గడ్డపై సెంచరీ సాధించి కరువును ఛేదిస్తాడో లేదో చూడాలి.
రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో కోహ్లీ తన విదేశీ సెంచరీ కరువును తొలగిస్తాడని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ ఐదేళ్లుగా విదేశీ టెస్ట్ సెంచరీ సాధించకపోవడం చాలా నిరాశ కలిగించే విషయం. చివరిసారిగా అతను 2018లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత విదేశీ టెస్ట్ సెంచరీ అతని నుండి రాలేదు. ఆ నిరీక్షణ ఈ సిరీస్‌లో ముగియవచ్చు అంటూ అతను జాతకం చెప్పాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.