సింగపూర్‌లో.. శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో విధాత: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా మొత్తం 4 బస్సుల ద్వారా సుమారు 200 మంది భక్తులు 11 దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. […]

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో
విధాత: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా మొత్తం 4 బస్సుల ద్వారా సుమారు 200 మంది భక్తులు 11 దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. ఈ శివరాత్రిని పురస్కరించుకొని సింగపూర్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి.
కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రవీణ్ మామిడాల, ముద్దం విజ్జేందర్, కిషన్ రావు, పందిరి విశ్వ ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, ప్రాంతీయ కార్యదర్శులు నడికట్ల భాస్కర్, బొందుగుల రాము వ్యవహరించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ఈ యాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.