Waiting at immigration counters । ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఎదురు చూపులకు ఇక చెక్‌

Waiting at immigration counters । విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద పడిగాపులు పడిన అనుభవాలు చాలా మందికి ఉంటాయి. గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఇదే విషయంలో అనేక మంది తమ అగచాట్లను సోషల్‌ మీడియాలో పంచుకోవడం, అవి తరచూ వైరల్‌ కావడం చూస్తూనే ఉంటాము. అయితే.. ఇకపై గంటల తరబడి ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి తొలగిపోనున్నది. విధాత : విదేశాలకు వెళ్లే […]

  • By: Somu    latest    Mar 17, 2023 10:51 AM IST
Waiting at immigration counters । ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఎదురు చూపులకు ఇక చెక్‌

Waiting at immigration counters । విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద పడిగాపులు పడిన అనుభవాలు చాలా మందికి ఉంటాయి. గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఇదే విషయంలో అనేక మంది తమ అగచాట్లను సోషల్‌ మీడియాలో పంచుకోవడం, అవి తరచూ వైరల్‌ కావడం చూస్తూనే ఉంటాము. అయితే.. ఇకపై గంటల తరబడి ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి తొలగిపోనున్నది.

విధాత : విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇకపై విమానాశ్రయాల్లో గంటల తరబడి ఇమిగ్రేషన్‌ (immigration) కౌంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేదు. కౌంటర్ల ముందు భారీ క్యూలలో నిలబడి దుస్థితిని తప్పించాలని కేంద్ర హోం శాఖ (Union home ministry) నిర్ణయించింది. ప్రధానంగా తగినంత సిబ్బంది ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఉండటకపోవడం సమస్యగా ఉన్నది.

ఈ ఏడాది వేసవి సెలవులకు అంతర్జాతీయ ప్రయాణాలు (international travel) చేసేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ట్రావెల్‌ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్‌ ఇబందులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తే సమస్య ఉండదని అంటున్నాయి.
ఎయిర్‌పోర్టులలో రెండు కీలక సంస్థలైన ఇమిగ్రేషన్‌తోపాటు కేంద్ర పరిశ్రమల భద్రతా విభాగం (సీఐఎస్‌ఎఫ్‌) కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ సమస్యలపై సమీక్షించిన హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా.. సత్వరమే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

కీలకమైన ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద వేచి చూసే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కట్టుబడి ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత దేశం కీలకమైన మార్కెట్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో రాకపోకలు మరింత పెరుగుతాయని, దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టుల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చడం, సెక్యూరిటీ చెక్‌, ఇమిగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలిపాయి.