TSPSC | టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్..! నాంపల్లిలో పోస్టర్ల కలకలం..!
TSPSC | టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. ‘టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ నాంపల్లి టీఎస్‌పీఎస్సీ కార్యాలయం సమీపంలో వెలిసిన పేరు వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ‘ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలు లభించును అంటూ బుధవారం పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ పేరిట పోస్టర్లు అంటించారు. ఇది ఉద్యోగ నియామక కార్యాలయం కాదు.. జిరాక్స్ సెంటర్ అని వాల్ పోస్టర్ల’లో ఎద్దేవా చేశారు. […]

TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. ‘టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ నాంపల్లి టీఎస్‌పీఎస్సీ కార్యాలయం సమీపంలో వెలిసిన పేరు వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ‘ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలు లభించును అంటూ బుధవారం పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ పేరిట పోస్టర్లు అంటించారు.
ఇది ఉద్యోగ నియామక కార్యాలయం కాదు.. జిరాక్స్ సెంటర్ అని వాల్ పోస్టర్ల’లో ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ప్రశ్నపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే కేసును సీబీఐకి అప్పగించి టీఎస్పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి.
నష్టపోయిన విద్యార్థలకు ఈ నెల నుంచి నెలకు రూ.10వేల చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి’ అంటూ పోస్టర్లలో డిమాండ్ చేశారు. పోస్టర్లలో ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా.. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నది. నిందితులు స్వగ్రామాల్లోనూ ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లుగా అనుమానించిన పోలీసులు.. ఈ మేరకు సోదాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోనూ మంగళవారం తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నాపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే లీకేజీకి పాల్పడ్డ ఇద్దరిని ఉద్యోగాల నుంచి ప్రభుత్వం తొలగించింది. రేణుకతో పాటు ఢాక్యానాయక్ ఉద్యోగుల నుంచి తొలగించింది. లీకేజీ వ్యవహారంలో ఇద్దరు ప్రస్తుతం జైలులో ఉన్నారు.