Warangal | బీటెక్ విద్యార్థి.. ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Warangal చెక్ డాం లో పడి మృతి హన్మకొండ జిల్లాలో విషాదం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సెల్ఫీ సరదా బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చేస్తున్న ముగ్గురు విద్యార్థులు ఫొటో షూట్ కోసం కఠాత్మకూర్ లోని చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో […]

Warangal | బీటెక్ విద్యార్థి.. ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Warangal

  • చెక్ డాం లో పడి మృతి
    హన్మకొండ జిల్లాలో విషాదం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సెల్ఫీ సరదా బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చేస్తున్న ముగ్గురు విద్యార్థులు ఫొటో షూట్ కోసం కఠాత్మకూర్ లోని చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కాజీపేటకు చెందిన ఇస్మాయిల్ వాగులో పడిపోయాడు.

తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నం చేయగా.. అప్పటికే నీటిలో మునిగి మృతి చెందాడు. కళ్ళముందే తమ స్నేహితుడు నీటిలో మునిగిపోవడంతో తల్లడిల్లారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇస్మాయిల్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

కాలేజీకి వెళ్లిన కుమారుడు చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంపై ఇస్మాయిల్ ఇద్దరు ఫ్రెండ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాణాలతో బయపడిన విద్యార్థులది హన్మకొండ సుబేదారి ప్రాంతానికి చెందిన వారీగా చెబుతున్నారు.