Warangal | హామిలిచ్చి అమలుచేయని సీఎం కేసీఆర్: ఈటల
Warangal వరద బాధితులను ఆదుకోవాలి నాలాల కబ్జాను అరికట్టాలి హనుమకొండలో ముంపు ప్రాంతాల సందర్శన బీజేపీ నేత ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలోని వరంగల్ లాంటి నగరాలను, ఇతర పట్టణాలను లండన్, డల్లాస్, న్యూయార్క్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ హామీలుగానే మిగిలిపోయాయని బీజేపీ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ఈ దుస్థితి కొనసాగుతూనే ఉందని, నిజాయితీగా పని చేయడం ఆయనకు చేతకాదన్నారు. […]

Warangal
- వరద బాధితులను ఆదుకోవాలి
- నాలాల కబ్జాను అరికట్టాలి
- హనుమకొండలో ముంపు ప్రాంతాల సందర్శన
- బీజేపీ నేత ఈటల రాజేందర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలోని వరంగల్ లాంటి నగరాలను, ఇతర పట్టణాలను లండన్, డల్లాస్, న్యూయార్క్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ హామీలుగానే మిగిలిపోయాయని బీజేపీ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ఈ దుస్థితి కొనసాగుతూనే ఉందని, నిజాయితీగా పని చేయడం ఆయనకు చేతకాదన్నారు.
కేటీఆర్ మీరు గతంలో హామీ ఇచ్చినట్టు నాలాల కబ్జా వెంటనే తొలగించాలని ఈటల డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాన్ని పట్టించుకోవాలని, స్మార్ట్ సిటీ పేరుతో కొన్ని వందల కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. వాటిని ఖర్చుపెట్టి మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడండంటూ హితవు పలికారు.
నాలాలు విస్తరిస్తామని కేటీఆర్ ఎప్పుడో చెప్పారు. కానీ ఆ పని జరగలేదు. ఉన్న నాలాలు 75 శాతం కబ్జాకు గురి అయ్యాయి. హైదరాబాద్ లో వరదలప్పుడు 10 వేల రూపాయలు ఎలా ఇచ్చారో ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం వరద ప్రాంతాలలో అలాగే అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇవ్వాలని, ఒక్కో షాపులు 2 లక్షలు ఇవ్వాలని, సీఎం భేషజాలకు పోకుండా వెంటనే డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాత్రమే సహాయం అందించాలి. మేమే బువ్వ పెట్టాలి అనే సంకుచితంగా వ్యవహరిస్తున్నారని ఈటెల విమర్శించారు. మిగతా పార్టీ వారిని రిహబిటేషన్ సెంటర్లకు పోనివ్వడం లేదని, ఇది మీ పతనానికి పరాకాష్ట. పిచ్చి వేషాలు బంద్ చేసుకోవాలని విమర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మరావు, కొండేటి శ్రీధర్, మొలుగూరి బిక్షపతి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, గురుమూర్తి శివకుమార్, డా. పెసరు విజయ్ చందర్ రెడ్డి, రావుల కిషన్, కుసుమ సతీష్, జిల్లా నాయకులు ఆర్.పి.జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బన్న ప్రభాకర్, తీగల భారత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.