Warangal | మేడే సందర్భంగా కదంతొక్కిన కామ్రేడ్లు.. జెండాల ఆవిష్క‌ర‌ణ‌

Warangal మహబూబాబాద్‌లో సిపిఐ, ఏఐటియుసి భారీ ప్రదర్శన జనగామలో సిపిఎం, సిఐటియు మహా ప్రదర్శన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడే దినోత్సవం సందర్భంగా కామ్రేడ్లు కదం తొక్కారు. ఎర్రజెండాల రెపరెపల నడుమ డప్పు చప్పుళ్ళు, డీజే పాటల మధ్య మేడేను అత్యంత ఘనంగా సోమవారం నిర్వహించారు. నృత్యాలతో శ్రామికులు దరువుకు తగ్గ చిందులేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎర్ర జెండాలను ఆవిష్కరించి మేడే స్ఫూర్తిని చాటి చెప్పారు. మహబూబాబాద్‌లో సిపిఐ, ఏఐటియుసి అధ్వర్యంలో భారీ […]

  • Publish Date - May 1, 2023 / 01:16 AM IST

Warangal

  • మహబూబాబాద్‌లో సిపిఐ, ఏఐటియుసి భారీ ప్రదర్శన
  • జనగామలో సిపిఎం, సిఐటియు మహా ప్రదర్శన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడే దినోత్సవం సందర్భంగా కామ్రేడ్లు కదం తొక్కారు. ఎర్రజెండాల రెపరెపల నడుమ డప్పు చప్పుళ్ళు, డీజే పాటల మధ్య మేడేను అత్యంత ఘనంగా సోమవారం నిర్వహించారు. నృత్యాలతో శ్రామికులు దరువుకు తగ్గ చిందులేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎర్ర జెండాలను ఆవిష్కరించి మేడే స్ఫూర్తిని చాటి చెప్పారు.

మహబూబాబాద్‌లో సిపిఐ, ఏఐటియుసి అధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్, మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి పిలుపునిచ్చారు. సిపిఐ, ఏఐటియుసి అధ్వర్యంలో 100 చోట్ల జెండాలు ఆవిష్కరణ చేశారు.

కార్యక్రమాలలో జిల్లా కార్యదర్శి బి విజయ సారథితో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబ లక్ష్మి, కట్లోజు పాండు రంగా చారీ, తండ సందీప్, వేరవెళ్ళి రవి, నర్రా శ్రావణ్, వెలుగు శ్రావణ్, ఫాతిమా, మేక వీరన్న, బానోత్ లింగ్య నాయక్, కేదాసు రమేష్, మాలోత్ రవీందర్, అజ్మీరా వేణు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

జనగామలో సిపిఎం, సిఐటియు మహా ప్రదర్శన

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం, సిఐటియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుండి వైష్ణవి గార్డెన్ వరకు భారీ ప్రదర్శన తో కార్మికులు కదం తొక్కారు. డీజే ఎర్రజెండా పాటలతో డప్పు చప్పులతో ఉత్తేజ పూరితంగా, కదం తొక్కుతూ పదం పాడుతూ నృత్యాలు చేస్తూ కోలహలంగా ప్రదర్శన నిర్వహించారు.

వైష్ణవి గార్డెన్ లో మే డే బహిరంగ సభ సిపిఎం, సిఐటియు టౌన్ కార్యదర్శులు జోగు ప్రకాష్, సుంచు విజెందర్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాకు కనక రెడ్డి, సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడారు. మే డే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం అని కొనియాడారు. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమని దోపిడికి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒకటైన రోజు అని పేర్కొన్నారు.

1886 మే 1న అమెరికా చికాగో నగరంలో హె మార్కెట్లో ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాదిమంది కార్మికులు ప్రదర్శన నిర్వహిస్తుంటే విచక్షణ రహితంగా కాల్పులు జరిపినారు. ఆ కాల్పుల్లో వీరమరణం పొందిన కార్మిక వీరులు ప్రపంచానికి అందించింది ఎర్రజెండ అని పేర్కొన్నారు. 137 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటాల ఫలితంగానే కార్మికులకు కొన్ని హక్కులు సాధించబడ్డాయని తెలిపారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Latest News