Warangal | హైకోర్టు అనుమతించినా.. లీకేజీ బాధిత విద్యార్థికి ‘మాల్ ప్రాక్టీస్‌ మెమో జారీ

Warangal మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్ల‌గా.. సప్లిమెంటరీలో పరీక్ష రాసేందుకు అవకాశం? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఎస్ఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధిత విద్యార్థి కి ఎస్ఎస్సి బోర్డు మాల్ ప్రాక్టీస్ కింద మెమో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇన్విజిలేటర్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థి దండబోయిన హరీష్ బాధితుడిగా మిగిలిన విషయం తెలిసిందే. పదవ […]

Warangal | హైకోర్టు అనుమతించినా.. లీకేజీ బాధిత విద్యార్థికి ‘మాల్ ప్రాక్టీస్‌ మెమో జారీ

Warangal

  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్ల‌గా..
  • సప్లిమెంటరీలో పరీక్ష రాసేందుకు అవకాశం?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఎస్ఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధిత విద్యార్థి కి ఎస్ఎస్సి బోర్డు మాల్ ప్రాక్టీస్ కింద మెమో జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇన్విజిలేటర్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థి దండబోయిన హరీష్ బాధితుడిగా మిగిలిన విషయం తెలిసిందే.

పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో హరీష్ ను మాల్ ప్రాక్టీస్ కింద నమోదు చేశారు. లీకేజీ వ్యవహారంలో బాధిత స్టూడెంట్‌ను హరీష్ ను పరీక్షలకు సస్పెండ్ చేసినప్పటికీ, హైకోర్టు అనుమతితో మిగతా పరీక్షలు రాయగా ఎస్ఎస్సి బోర్డు మాత్రం మాల్ ప్రాక్టీస్ కింద ఫెయిల్ చేసింది.

ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకుపోగా సప్లమెంటరీలో పరీక్ష రాసుకునేందుకు అనుమతించినట్లు సమాచారం.