Warangal | కాంగ్రెస్‌లో కర్నాటకోత్సాహం.. హనుమకొండలో సంబురాలు

Warangal రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ శ్రేణుల్లో కర్ణాటక విజయోత్సవం పెల్లుబికింది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సందర్భంగా హనుమకొండ, జనగామ, ములుగు, కాజీపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్స్ పంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు, బీజేపీ కాలం చెల్లిందన్నారు. […]

  • Publish Date - May 13, 2023 / 10:12 AM IST

Warangal

  • రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ శ్రేణుల్లో కర్ణాటక విజయోత్సవం పెల్లుబికింది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సందర్భంగా హనుమకొండ, జనగామ, ములుగు, కాజీపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్స్ పంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు, బీజేపీ కాలం చెల్లిందన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవినీతి పాలనతో నరకయాతన అనుభవించారు. బీజేపీ పాలనతో విసుగు చెందారు. ఎన్నికలెప్పడొస్తాయని ఎదురు చూసి, ఓటుతో గుణపాఠం చెప్పారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో గెలిపించారని అన్నారు. దేశ ప్రజలు బీజేపీ పాలన నుంచి ఏ విధంగా అయితే విముక్తి కోరుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి అవినీతి పాలనకు చరమగీతం పాడాలనుకుంటున్నారని అన్నారు. ఇక పతనం మొదలైంది, బీజేపీకి, బి ఆర్ ఎస్ పార్టీ కి గుణపాఠం చెబుతూ ఆరు నెలల్లో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

పలుచోట్ల సంబురాలు

జనగామలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, జిల్లా నాయకులు ఉడుత రవి, పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, nsui మాజీ జిల్లా అధ్యక్షులు జక్కుల వేణు మాధవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిసర దిలీప్ రెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు చింతకింది మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేటలో జంగా రాఘవరెడ్డి తదితరులు, ములుగులో రాజేందర్ పాల్గొన్నారు.