Warangal | 3 రోడ్డు ప్రమాదాలు.. ఎస్సై సహ ముగ్గురు మృతి, ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

Warangal మృతుల్లో ఒకరు ఎస్ఐ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఎస్సై ఉన్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండ మండలంలో.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారి గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా […]

Warangal | 3 రోడ్డు ప్రమాదాలు.. ఎస్సై సహ ముగ్గురు మృతి, ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

Warangal

  • మృతుల్లో ఒకరు ఎస్ఐ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఎస్సై ఉన్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గీసుకొండ మండలంలో..

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారి గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) మృతి చెందాడు.

గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన కుమారస్వామి ఒంటరిగా కారు నడుపుకుంటూ వస్తుండగా, కారు కంట్రోల్ తప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

హనుమకొండలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హన్మకొండ నక్కలగుట్టలోని మునిసిపల్ ఆఫీస్ ఎదుట జరిగింది. బైక్ పై వెళ్తున్న వారిని వాటర్ సప్లై చేసే టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

గణపురం మండలంలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం లోని కర్కపల్లి గ్రామానికి చెందిన ఇడబోయిన చిలుకమ్మ తన మనమరాలను చూసేందుకు గాంధీ నగర్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా.. తనకు తెలిసిన ఖమ్మం జిల్లా కు చెందిన వెంకన్న బైక్ పై వెళ్తూ కనిపించాడు.

దీంతో ఆమె తనను గ్రామంలో దించాలి అని అడగగా.. బైక్ పై ఎక్కించుకున్నాడు. గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో హాస్పిటల్ తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన చిలుకమ్మ మార్గ మధ్యలో మృతి చెందినట్లు సమాచారం.