Viral Video | కారులో చెలరేగిన మంటలు.. అపస్మారక స్థితిలో డ్రైవర్..
America | అమెరికాలోని లాస్ వేగస్‌లో ఘోరం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు బానెట్‌లో పొగలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఓ పోలీసు, మరో వ్యక్తి అప్రమత్తమయ్యారు. కారు డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. కారులో ఉన్న డ్రైవర్‌ను పోలీసు, ఆ వ్యక్తి బయటకు లాగారు. అతను అప్పటికే స్పృహ కోల్పోయి ఉండటంతో.. పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. […]

America | అమెరికాలోని లాస్ వేగస్‌లో ఘోరం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు బానెట్‌లో పొగలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఓ పోలీసు, మరో వ్యక్తి అప్రమత్తమయ్యారు.
కారు డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. కారులో ఉన్న డ్రైవర్‌ను పోలీసు, ఆ వ్యక్తి బయటకు లాగారు. అతను అప్పటికే స్పృహ కోల్పోయి ఉండటంతో.. పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మంటలను ఆర్పేశారు.
ఈ ఘటన జనవరి 27వ తేదీన సాయంత్రం 4:37 గంటలకు చోటు చేసుకుంది. ఇక ఆ ప్రమాదం నుంచి డ్రైవర్‌ను కాపాడిన పోలీసుతో పాటు పౌరుడిపై లాస్ వేగస్ పోలీసులు ప్రశంసలు కురిపించారు. క్షణం ఆలస్యం చేసిన ఆ డ్రైవర్ ప్రాణాలతో బతికేవాడు కాదని, పోలీసు సకాలంలో స్పందించడం గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.
View this post on Instagram