తెలంగాణ గళం..దళం..బలం మేమే అందుకే బీఆరెస్‌ను గెలిపించాలి

పార్లమెంటులో తెలంగాణ గళం..దళం..బలం బీఆరెస్ మాత్రమేనని, ఇందుకు 16,17 లోక్‌సభ తెలంగాణ

పార్లమెంటులో తెలంగాణ గళం..దళం..బలం బీఆరెస్ మాత్రమేనని, ఇందుకు 16,17 లోక్‌సభ తెలంగాణ నుంచి బీఆరెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలే నిదర్శనమని.. అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.


ట్వీట్టర్ వేదికగా బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో ఆయన ట్విట్టర్ వేదిగా వివరించారు. 16,17లోక్‌సభలలో బీఆరెస్ ఎంపీలు మొత్తం 4,574ప్రశ్నలు వేశారని, కాంగ్రెస్ ఎంపీలు 1271, బీజేపీ ఎంపీలు 190ప్రశ్నలు వేశారని పేర్కోన్నారు. అందుకే నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ గళం.. దళం..బలం దళం మనమేనన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణకు..విభజన అంశాల సాధనకు బీఆరెస్ ఎంపీలు మాత్రమే పోరాడుతారని అందుకే తెలంగాణ ప్రజలు తమ ప్రతినిధులుగా పార్లమెంటు బీఆరెస్ ఎంపీలను ఎన్నుకోవాల్సిన అవసరముందన్నారు.