Pawan Kalyan | సమాజానికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మనపై ఉంది: పవన్ కళ్యాణ్

మానవీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ఐటిలో స్ప్రింగ్ ఫ్రీ 23 ఉత్సవం ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మన ఉన్నతికి సమాజం ఎంతో ఇస్తుందని అట్లాంటి సమాజానికి తిరిగి ఎంతో కొంత మనం చెల్లించాల్సిన బాధ్యత ఉందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్భోదించారు. ఎన్ఐటీలో గురువారం రాత్రి ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ 2023 ఉత్సవానికి […]

  • Publish Date - April 6, 2023 / 03:46 PM IST
  • మానవీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
  • సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది
  • ఎన్ఐటిలో స్ప్రింగ్ ఫ్రీ 23 ఉత్సవం
  • ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మన ఉన్నతికి సమాజం ఎంతో ఇస్తుందని అట్లాంటి సమాజానికి తిరిగి ఎంతో కొంత మనం చెల్లించాల్సిన బాధ్యత ఉందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్భోదించారు. ఎన్ఐటీలో గురువారం రాత్రి ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ 2023 ఉత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యావంతులుగా మనం ఎదిగిన తర్వాత సమాజానికి ఎంతోకొంత తోడ్పాటునందించినప్పుడే మన జీవితాలు ధన్యం అవుతాయని అన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, సంస్కృతి పరిరక్షణ కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా విద్యార్థులు, యువతపై ఈ బాధ్యత ఎక్కువగా ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగే పరిశోధనలతో పాటు సమాజాభివృద్ధికి మానవీయకోణంతో ముందుకు సాగినప్పుడే సార్థకత నెలకొంటుంది అన్నారు. గొప్ప గొప్ప ఆవిష్కరణల కంటే సమాజానికి ఉపయోగపడే ఉన్నతమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అణుబాంబును సృష్టించిన శాస్త్రవేత్త ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసి బాధపడ్డారని గుర్తు చేశారు.

అదే ఓఆర్ఎస్ ను ఆవిష్కరించిన శాస్త్రవేత్త వల్ల బంగ్లాదేశ్లో వచ్చిన కలరా నుంచి సుమారు అయిదు కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడారని చెప్పారు. ఎలాంటి సొంత ప్రయోజనం ఆశించకుండా సమాజానికే పేటెంట్ను అందించారని అన్నారు. వివిధ శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలు, సమాజానికి వాటి ఉపయోగాల గురించి వివరించారు.

మేధో సంపత్తిని పెంపొందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, రుగ్మతలపై యువత పోరాటం చేయాలని కోరారు. శ్రమ చేస్తే ఫలితాలు వస్తాయన్నారు. వివిధ రకాలుగా మనుషులు మనం విడిపోయినప్పటికీ మన మధ్య సంస్కృతి కారణంగా నిలుస్తుంది అన్నారు.

ఈ ఉత్సవానికి వివిధ ఎన్ఐటి లకు చెందిన విద్యార్థులు 8వేల మంది హాజరయ్యారు గురువారం నుంచి ఈనెల తొమ్మిదవ తారీకు వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు వివిధ అంశాలపై ఇందులో పోటీలు నిర్వహిస్తారు. కళాధ్వని ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క థీమ్‌గా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, ప్రొఫెసర్ పులి రవి కుమార్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ , ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొ. ఎం హీరాలాల్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థి సమన్వయకర్తలు వంశీ కిషోర్, అజయ్ కుమార్, పీయూష్ కుమార్ & సాయి గురునాథ్ సమావేశంలో్ పాల్గొన్నారు.

SpringSpree’23 NITW కమ్యూనిటీలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ఉత్సాహాన్ని నింపడానికి థీమ్ “కళధ్వని”ని ప్రకటించింది. ప్రీ-ఈవెంట్‌లుగా హోలీ వేడుకలు, గ్రామ సందర్శన, ethnic night, లాంతరు night మరియు మీటర్ టీమ్‌తో సెలబ్రిటీ ఇంటరాక్షన్ వంటి 4 ఈవెంట్‌లు ఇప్పటి వరికి జరిగినాయి. ఇంకా, టీమ్ రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రీ ఈవెంట్‌లను ప్లాన్ చేస్తోంది.టాలీవుడ్ రాత్రి,బాలీవుడ్ రాత్రి నిర్వహించనున్నారు.