BJP: సుఖేష్ విషయం దృష్టి మళ్లించేందుకే CM KCR ప్రయత్నాలు: బండి సంజయ్
విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు తోడుగా సూది, దబ్బనం పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయని సంజయ్ సెటైర్ వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల […]

విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు తోడుగా సూది, దబ్బనం పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయని సంజయ్ సెటైర్ వేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేసిన విషయం వాస్తవమే అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై చేసే ఉమ్మడి పోరాటంలో కాంగ్రెస్ ఉంటే తాము రాలేమని షర్మిలతో చెప్పినట్టు సంజయ్ తెలిపారు. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆయన కూతురు కవిత, కొడుకు కేటీఆర్‌లను కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్నారని సంజయ్ ధ్వజమెత్తారు.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి రైతులను తెలంగాణ భవన్‌కు పిలిపించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి మంత్రి సత్యేంద్ర జైన్‌కు తెలంగాణ భవన్‌లో ఏపీ అనే వ్యక్తికి రూ. 75 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ వెల్లడించిన విషయాన్ని సంజయ్ తెలిపారు.