West Bengal | స్థానికంలో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
West Bengal విధాత: పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 34,694 పంచాయతీల్లో తృణమూల్ జయకేతనం ఎగరేసింది . మరో 677సీట్లలో ఆధిక్యతలో ఉంది. ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ 9,656సీట్లలో గెలుపొందగా, మరో 166సీట్లలో ఆధిక్యతలో ఉంది. సీపీఐఎం 2926 సీట్లలో విజయం సాధించగా, 86సీట్లలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2,528 స్థానాల్లో గెలుపొందగా, మరో […]

West Bengal
విధాత: పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 34,694 పంచాయతీల్లో తృణమూల్ జయకేతనం ఎగరేసింది . మరో 677సీట్లలో ఆధిక్యతలో ఉంది. ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ 9,656సీట్లలో గెలుపొందగా, మరో 166సీట్లలో ఆధిక్యతలో ఉంది. సీపీఐఎం 2926 సీట్లలో విజయం సాధించగా, 86సీట్లలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2,528 స్థానాల్లో గెలుపొందగా, మరో 65స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.
పంచాయతీ సమితిలలో టీఎంసీ 6,335సీట్లలో గెలుపొందగా, 214స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ 973స్థానాల్లో గెలుపొందగా, 48 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. సీపీఎం 173 సమితిల్లో గెలుపొందగా, మరో 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 258సమితిలలో గెలుపొందగా, మరో 7 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. 9,728 పంచాయతీ సమితిలకు ఎన్నికలు జరిగాయి.
928 జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 635, గెలుపొందగా,164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 21చోట్ల గెలుపొందగా, 6సీట్లలో ఆధిక్యతలో ఉంది. సీపీఐఎం 2 సీట్లలో గెలుపొందగా, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6చోట్ల గెలుపొందగా, మరో 6చోట్ల ఆధిక్యంలో ఉంది.
హింసాత్మక సంఘటనల మధ్య సాగిన బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా సైతం డైమండ్ హర్భర్ లెక్కింపు కేంద్రం పై దుండగులు బాంబులు విసిరారు. ఈ పేలుడులో ఎవరికి హాని జరుగలేదు. కేంద్ర రాష్ట్ర బలగాలు ఎన్నికలలో మరింత హింస చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించాయి.
బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిక్యత కనబరిచి మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న టీఎంసీ పార్టీ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీ తమ పార్టీ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న 2024 పార్లమెంట్‌లో ప్రజల ఆలోచనా ధోరణికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. ఇదే రీతిలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ బెంగాలో టీఎంసీ ఘన విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.