PS 2: పొన్నియన్ సెల్వం 2 పరిస్థితి ఏమిటి! రిలీజవుతుందా.. వాయిదానా?

విధాత, సినిమా: లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ వహించిన పొనియన్ సెల్వ‌న్ 1 గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందింది. చోళుల కథాంశంతో తెరకెక్కింది. తమిళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మిగిలిన భాషలలో ఈ మూవీ క‌థాంశం పరంగా కనెక్ట్ అయినా అందులో క్యారెక్టర్స్ పేర్ల విషయంలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ పేర్లు వాళ్లకు కొత్తగా అనిపించాయి. కథాపరంగా పరవాలేదు అనిపించుకుంది యాక్షన్ కంటే డ్రామాకి మణిరత్నం […]

PS 2: పొన్నియన్ సెల్వం 2 పరిస్థితి ఏమిటి! రిలీజవుతుందా.. వాయిదానా?

విధాత, సినిమా: లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ వహించిన పొనియన్ సెల్వ‌న్ 1 గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందింది. చోళుల కథాంశంతో తెరకెక్కింది. తమిళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

మిగిలిన భాషలలో ఈ మూవీ క‌థాంశం పరంగా కనెక్ట్ అయినా అందులో క్యారెక్టర్స్ పేర్ల విషయంలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ పేర్లు వాళ్లకు కొత్తగా అనిపించాయి. కథాపరంగా పరవాలేదు అనిపించుకుంది యాక్షన్ కంటే డ్రామాకి మణిరత్నం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

బాహుబలి సిరీస్ చూసిన తర్వాత దీనికి ఎలాంటి పోలికలు ఉండవ‌ని ప్రమోషన్‌లో చెబుతూ వచ్చారు. పొన్నియ‌న్ సెల్వన్ 2ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా ప్ర‌చారం జరుగుతుంది. సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. పోస్ట్ పొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో చెప్పిన డేట్ కే ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని అర్థం అవుతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే చియాన్ విక్రమ్ పా రంజిత్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. కార్తీ జపాన్ మూవీని రీలిజ్‌కు సిద్ధం చేస్తున్నాడు. జయం రవి వేరొక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ మార్చి ఆఖరి నుంచి కొన్ని పొనియ‌న్ సెల్వ‌న్ 2 ప్రమోషన్ వర్క్‌లో పాల్గొనే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.