WhatsApp | గ్రూప్ కాల్స్ ఎక్కువగా మాట్లాడాతరా..? మీ కోసమే.. వాట్సాప్ క్రేజీ ఫీచర్..!
WhatsApp | ఇన్‌స్టెంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు మెటా యాజమాన్యంలోని కంపెనీ సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో యాప్‌ను తీసుకు వచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న ఫీచర్స్‌లో గ్రూప్ కాల్స్ సైతం ఒకటి. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఒకచోట చేరి ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఈ […]

WhatsApp |
ఇన్‌స్టెంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు మెటా యాజమాన్యంలోని కంపెనీ సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో యాప్‌ను తీసుకు వచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న ఫీచర్స్‌లో గ్రూప్ కాల్స్ సైతం ఒకటి.
ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఒకచోట చేరి ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఈ గ్రూప్ కాల్స్‌లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. తాజాగా ‘కాల్స్’ ట్యాబ్‌లో పలు మార్పులు చేసింది.
అప్‌డేట్‌తో వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో 31 మంది గ్రూప్‌కాల్స్‌ను మాట్లాడుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
మరో వైపు యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తున్న వాట్సాప్ ఇందులో భాగంగా మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ఎండ్ టూ ఎండ్ ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం ఆటోమేటెడ్ సెక్యూరిటీ కోడ్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ఈ ఫీచర్ సైతం బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్నది. ట్రయల్స్ పూర్తయ్యాక యూజర్లందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నది.