WhatsApp | వాట్సాప్ మరో ఫీచర్ తెస్తుందిగా..! యూజర్లందరికీ మరింత ప్రైవసీ..!
WhatsApp | ఇన్‌స్టెంట్ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. దాంతో యూజర్లకు ప్రైవసీ విషయంలో మరింంత ప్రయోజనకరంగా ఉండనున్నది. త్వరలోనే ఫోన్ నంబర్ ప్రైవసీ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేబోతున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది. అయితే, మెటా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వాట్సాప్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే […]

WhatsApp | ఇన్‌స్టెంట్ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. దాంతో యూజర్లకు ప్రైవసీ విషయంలో మరింంత ప్రయోజనకరంగా ఉండనున్నది.
త్వరలోనే ఫోన్ నంబర్ ప్రైవసీ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేబోతున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది. అయితే, మెటా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
కానీ, వాట్సాప్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే WABetaInfo ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ఉన్న బీటా యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని తెలిపింది.
ఫీచర్ ఎవరి కోసమంటే..?
వాట్సాప్ తీసుకురాబోయే సరికొత్త ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి రానున్నది. కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది. వాట్సాప్ కమ్యూనిటీలోని యూజర్లు ఫోన్ నంబర్‌ను తమకు పరిచయంలేని వ్యక్తులకు తెలియజేయడం ఇష్టం లేకోతే.. వాట్సాప్ సెట్టింగ్‌లో ‘ఫోన్ నెంబర్ ప్రైవసీ ఫీచర్‌ను ఇనేబుల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, ఈ ఫీచర్ ఇనేబుల్ చేసుకున్నప్పటికీ.. కమ్యూనిటీ అడ్మిన్‌తో పాటు మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ అయి ఉన్న వారికి మీరు మాత్రం కనిపిస్తుంటుంది. కమ్యూనిటీలోని ఇతరులకు మాత్రం మొబైల్ నంబర్ కనిపించదు. అలాగే, కమ్యూనిటీ అడ్మిన్ సైతం ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోలేడు. కమ్యూనిటీ అడ్మిన్ నంబర్ ఆ కమ్యూనిటీలోని అందరు సభ్యులకి తప్పనిసరిగా కనిపిస్తుంది.