Rakhi Festival | రాఖీ పండుగ ఎప్పుడు.. ఆ ముహుర్తంలో రాఖీ క‌ట్టొచ్చా..?

Rakhi Festival | మ‌న దేశంలో జ‌రుపుకునే పండుగ‌ల్లో.. ఒక్కో పండుగకు ఒక్కో ర‌క‌మైన ప్రాధాన్య‌త ఉంది. కానీ రాఖీ పండుగ‌ను మాత్రం దేశ‌మంతా ఒకే విధంగా నిర్వ‌హించుకుంటారు. రాఖీ ప‌ర్వ‌దినం రోజున అక్కాచెల్లెల్లు త‌మ సోద‌రుల‌కు రాఖీ క‌ట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేకాదు.. సోద‌రసోద‌రీమ‌ణుల మ‌ధ్య బంధం మ‌రింత బలోపేత‌మ‌వుతుంది. అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న రాఖీ పండుగ‌ను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వ‌చ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగ […]

  • By: raj    latest    Aug 16, 2023 5:28 PM IST
Rakhi Festival | రాఖీ పండుగ ఎప్పుడు.. ఆ ముహుర్తంలో రాఖీ క‌ట్టొచ్చా..?

Rakhi Festival |

మ‌న దేశంలో జ‌రుపుకునే పండుగ‌ల్లో.. ఒక్కో పండుగకు ఒక్కో ర‌క‌మైన ప్రాధాన్య‌త ఉంది. కానీ రాఖీ పండుగ‌ను మాత్రం దేశ‌మంతా ఒకే విధంగా నిర్వ‌హించుకుంటారు. రాఖీ ప‌ర్వ‌దినం రోజున అక్కాచెల్లెల్లు త‌మ సోద‌రుల‌కు రాఖీ క‌ట్టి ఆశీర్వాదం తీసుకుంటారు.

అంతేకాదు.. సోద‌రసోద‌రీమ‌ణుల మ‌ధ్య బంధం మ‌రింత బలోపేత‌మ‌వుతుంది. అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న రాఖీ పండుగ‌ను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వ‌చ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

అయితే ఈ ఏడాది రాఖీ పండుగ విషయంలో గందరగోళం నెలకొంది. రాఖీపండుగ ఆగ‌స్టు 30న లేక 31వ తేదీనా అనేది అర్థం కావడం లేదు. మ‌రి పండితులు, పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30, 31 తేదీల్లో ఉంది. అయితే 30వ తేదీన‌ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.

శుభ స‌మ‌యం ఇదే..

నిజానికి రక్షాబంధన్ యొక్క శుభ సమయం ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై..ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు.
ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది.

ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు, రాఖీ కూడా కట్టకూడదు. భద్ర ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టవద్దు. ఎందుకంటే భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే లంకాధిపతి రావణుడి సోదరి భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం వల్లే రాముడి చేతిలో చంపబడ్డాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

భ‌ద్ర‌కాలం అంటే..

భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే.ఈయన సోదరి భద్ర. ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది.

పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు.