CM Jagan |
విధాత, ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఎందుకివ్వాలి..? అంటూ అంగళ్లు, పుంగనూరుల్లో చంద్రబాబు రెచ్చగొట్టిన తీరుపై సీఎం వైయస్ జగన్ (CM Jagan) తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తీరు నాకు బాధనిపించిందని, వారిని ప్రజలు నమ్మడం లేదని తెలిసి, రెచ్చగొట్టాలన్న ఆలోచనలు చేస్తున్నారని, అందుకే మీటింగ్‌ల్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడతున్నారన్నారు.
అంగళ్లులో చంద్రబాబు (Chandra Babu) తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించాడన్నారు. పుంగనూరులో చంద్రబాబు తాను పర్మిషన్ తీసుకున్న రూట్‌లో కాకుండా మరో రూట్‌లోకి ఎంటరయ్యాడని, పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెబితే వారిని ఇష్టానుసారంగా మాట్లాడాడన్నారు. 47 మంది పోలీసులను గాయపరిచేలా కార్యకర్తలతో దాడులు చేయించాడని, ఒక పోలీసుకు కన్ను పోగొట్టాడన్నారు.
గొడవలు జరగాలి, శవరాజకీయాలు చేయాలన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందంటు మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వారివే కాబట్టి వాళ్లు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందన్నట్లుగా వారి తీరు వక్రమార్గంలో సాగుతుందన్నారు. ఎలాగూ మైకులు పట్టుకుని మాట్లాడటానికి దత్తపుత్రుడు కూడా తోడుగా ఉన్నాడని, శవ రాజకీయాలకు సైతం వెనుకాడటం లేదని, ఇలాంటి వారి గురించి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నారు.