High Court |
తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా
హైదరాబాద్, విధాత: షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నగర భేరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యదేవ నాయక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
కమిషన్‌ను నియమించక పోవడంతో మా సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని హైకోర్టుకు సూచించారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇంత వరకు షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్‌ను నియమించకపోవడం ఎంటీ? ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
కమిషన్ లేకపోవడం వల్ల షెడ్యూల్ ట్రైబ్స్ వారి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని నిలదీసింది. దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేసి పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.