Khammam | మతిస్థిమితం లేని భార్య.. భర్త శవంతో నాలుగు రోజులు ఇంట్లోనే..
Khammam | భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటున్నారు. భార్యకేమో మతిస్థిమితం లేదు. భర్తనేమో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం భర్త ఇంట్లోనే చనిపోయాడు. కానీ ఆ విషయాన్ని భార్య గ్రహించలేదు. భర్త మృతదేహాంతోనే ఆమె కలిసి ఉంటోంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. భర్త డెడ్‌బాడీ ఉబ్బి దుర్వాసన వస్తున్నా.. ఆమె పసిగట్టలేకపోయింది. చివరకు ఆదివారం కుమారుడు ఇంటికి రావడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన ఖమ్మం […]

Khammam | భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటున్నారు. భార్యకేమో మతిస్థిమితం లేదు. భర్తనేమో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం భర్త ఇంట్లోనే చనిపోయాడు. కానీ ఆ విషయాన్ని భార్య గ్రహించలేదు.
భర్త మృతదేహాంతోనే ఆమె కలిసి ఉంటోంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. భర్త డెడ్‌బాడీ ఉబ్బి దుర్వాసన వస్తున్నా.. ఆమె పసిగట్టలేకపోయింది. చివరకు ఆదివారం కుమారుడు ఇంటికి రావడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వైరాకు చెందిన బోగి వీరభద్రం(65) రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా పని చేసి పదవీ విరమణ పొందాడు. భార్య మంగమ్మతో కలిసి సొంతింట్లోనే ఉంటున్నాడు. వీరభద్రం, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
ఒక కుమారుడు, కుమార్తె హైదరాబాద్‌లో నివసిస్తుండగా, మరో కుమారుడు వెంకటకృష్ణ ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నాడు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి అనారోగ్యానికి గురవడంతో.. ప్రతీ రోజూ వారి పిల్లలు ఫోన్ చేసి మాట్లాడేవారు.
కానీ నాలుగు రోజుల నుంచి తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తల్లి మంగమ్మనే ఏదో మాట్లాడుతూ ఫోన్ పెట్టేసేది. నిన్న ఆదివారం సెలవు కావడంతో వెంకటకృష్ణ తల్లిదండ్రులను చూసొద్దామని ఇంటికి వచ్చాడు. ఇంట్లో మంచంపై తండ్రి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు వెంకటకృష్ణ.
తండ్రి శరీరం ఉబ్బిపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. తల్లేమో తన పని తాను చేసుకుంటుంది. దీంతో వెంకటకృష్ణ కొణిజర్ల పోలీసులకు సమాచారం అందించాడు. తండ్రి అనారోగ్యంతో చనిపోయి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.