Medak | తడిబట్టలతో అమ్మవారి గుడిమెట్లెక్కుదాం.. ఏడుపాయల ఆలయంలో అవినీతిని నిరూపిస్తారా?: దేవేందర్ రెడ్డి

Medak | ఏడుపాయల ఆలయంలో అవినీతిని నిరూపిస్తారా? ప్రతిపక్షాలకు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సవాల్ విధాత, మెదక్ బ్యూరో: ‘ఏడుపాయల ఆలయంలో ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. తాను తప్పు చేయలేదని అమ్మవారి సన్నిధిలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్తున్నా. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపించే దమ్ము, ధైర్యం ఉన్న నాయకులు తడి బట్టలతో ఆలయంలోకి వస్తారా?’ అని ఇఫ్కో డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు యం దేవేందర్ రెడ్డి […]

Medak | తడిబట్టలతో అమ్మవారి గుడిమెట్లెక్కుదాం.. ఏడుపాయల ఆలయంలో అవినీతిని నిరూపిస్తారా?: దేవేందర్ రెడ్డి

Medak |

  • ఏడుపాయల ఆలయంలో అవినీతిని నిరూపిస్తారా?
  • ప్రతిపక్షాలకు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సవాల్

విధాత, మెదక్ బ్యూరో: ‘ఏడుపాయల ఆలయంలో ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. తాను తప్పు చేయలేదని అమ్మవారి సన్నిధిలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్తున్నా. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపించే దమ్ము, ధైర్యం ఉన్న నాయకులు తడి బట్టలతో ఆలయంలోకి వస్తారా?’ అని ఇఫ్కో డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు యం దేవేందర్ రెడ్డి సవాల్ విసిరారు.

మంగళవారం మెదక్ లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు అడ్డాగా మారిందని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ బలంగా మారుతోందని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ తిరిగి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించినట్లు చెప్పారు బీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి బంగపడ్డ వారు తనపై విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో ఏడుపాయల ఆదాయం రూ.1.30 కోట్లు ఉండేదని, అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రస్తుతం రూ.8 కోట్ల కు చేరుకుందని చెప్పారు. ఏడుపాయల ఘటన పై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగిన నాయకుల్లో ఏడుపాయల చైర్మన్ పదవి చేసినోళ్లు కూడా ఉన్నారని, వారు ఏడుపాయలను ఎంతవరకు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.

ఏడుపాయల వన దుర్గ మాత మిశ్రమ బంగారం, వెండి కానుకలను 20 ఏళ్ళల్లో వారు ఎందుకు లెక్క తేల్చలేదని నిలదీశారు. దేవన్న అన్నంత మాత్రాన తప్పు చేసినట్లేనా? తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే ఆలయ ఈఓ ను సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాల గౌడ్, నిజాంపేట్ ఎంపీపీ దిశెట్టి సిద్ధిరాములు, హవేళిఘనాపూర్ నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు పీ సుధాకర్ రెడ్డి, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తలు పాల్గొన్నారు.