కొడుకు, కోడలి కోసం.. మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ!

Viral News | విధాత: చాలా మంది దంపతులకు సహజంగానే పిల్లలు పుట్టేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ 56 ఏండ్ల మహిళ కూడా సరోగసి పద్ధతి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు, కోడలి కోసం వారిని ఒప్పించి మరి ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. మీరు చదువుతున్నది […]

కొడుకు, కోడలి కోసం.. మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ!

Viral News | విధాత: చాలా మంది దంపతులకు సహజంగానే పిల్లలు పుట్టేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు.

తాజాగా అమెరికాకు చెందిన ఓ 56 ఏండ్ల మహిళ కూడా సరోగసి పద్ధతి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు, కోడలి కోసం వారిని ఒప్పించి మరి ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. మీరు చదువుతున్నది నిజమే. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

మునుగోడు ఫలితాలు: 1631 ఓట్ల అధిక్యంలో టీఆర్‌ఎస్‌

అమెరికాలోని ఉతహ్‌కు చెందిన నాన్సీ హాక్(56) వృత్తిరీత్యా వెబ్ డెవలపర్. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు జెఫ్ హాక్‌కు కేంబ్రియాతో వివాహం జరిపించారు. నలుగురు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. అయినా ఐదో సంతానంగా మరోక బిడ్డను కనాలని ఆశ పడ్డారు.

కానీ అనారోగ్య సమస్యల కారణంగా కేంబ్రియా గర్భాశయాన్ని తొలగించారు. దీంతో ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్న సమయంలో జెఫ్ తల్లి వారికి ఓ సలహా ఇచ్చింది. సరోగసి ద్వారా వారి బిడ్డను తానే కంటానని చెప్పింది.

నాన్సీ హాక్ ఈ విషయం చెప్పేసరికి మొదట కుమారుడు, కోడలు తిరస్కరించారు. కానీ చివరకు ఎలాగోలా నాన్సీ తన కుమారుడు, కోడలిని ఒప్పించింది. 9 గంటల పాటు పురిటి నొప్పులు భరించి సరోగసి ద్వారా నాన్సీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మునుగోడు: ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉంది: బండి సంజయ్‌

అనంతరం మనుమరాలిని చూసి నానమ్మ నాన్సీ మురిసిపోయింది. ఆ పాపకు హన్హా అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని కేంబ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. నాన్సీ బేబీ బంప్‌ ఫొటోలు సైతం పంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త, ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.