వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు
అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహంతో మహిళలు 4వైన్ షాపులపై దాడి చేసి లూటీ చేసిన ఘటన వైరల్‌గా మారింది

- అధిక ధరలపై మహిళాగ్రహం
విధాత : అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహంతో మహిళలు 4వైన్ షాపులపై దాడి చేసి లూటీ చేసిన ఘటన వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం – ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని.. ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని స్థానికులు, మహిళలు ఒకేసారి 4 వైన్ షాపులపై దాడి చేసి మద్యం నిల్వలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాము గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ శాఖ పట్టించుకోలేదని గ్రామస్తులు,మహిళలు ఆరోపించారు.