Jose Paulino Gomes | ప్ర‌పంచంలో.. అతి పెద్ద వ‌య‌స్కుడు ‘గోమ్స్’ కన్నుమూత.. మరో వారంలో పుట్టినరోజు

Jose Paulino Gomes 127 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూత మూడు పాండ‌మిక్‌లు, రెండు ప్ర‌పంచ యుద్ధాలు చూశాడు. మరో వారంలో 128 పడిలోకి 7 సంతానం, 25మంది మ‌నవ‌లు, 42మంది మునిమ‌న‌వులు, 11మంది ముని ముని మ‌నవులు విధాత‌: ప్ర‌స్తుతం జీవించి ఉన్న‌వారిలో అతిపెద్ద వ‌యసున్న (Old Age Man) వ్య‌క్తి.. 127 ఏళ్ల జోస్ పాలినో గోమ్స్ (Jose Paulino Gomes) క‌న్నుమూసిన‌ట్టు న్యూయార్క్ పోస్ట్ క‌థ‌నం పేర్కొంది. బ్రెజిల్‌ (Brazil) కు చెందిన గోమ్స్.. […]

Jose Paulino Gomes | ప్ర‌పంచంలో.. అతి పెద్ద వ‌య‌స్కుడు ‘గోమ్స్’ కన్నుమూత.. మరో వారంలో పుట్టినరోజు

Jose Paulino Gomes

  • 127 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూత
  • మూడు పాండ‌మిక్‌లు, రెండు ప్ర‌పంచ యుద్ధాలు చూశాడు.
  • మరో వారంలో 128 పడిలోకి
  • 7 సంతానం, 25మంది మ‌నవ‌లు, 42మంది మునిమ‌న‌వులు, 11మంది ముని ముని మ‌నవులు

విధాత‌: ప్ర‌స్తుతం జీవించి ఉన్న‌వారిలో అతిపెద్ద వ‌యసున్న (Old Age Man) వ్య‌క్తి.. 127 ఏళ్ల జోస్ పాలినో గోమ్స్ (Jose Paulino Gomes) క‌న్నుమూసిన‌ట్టు న్యూయార్క్ పోస్ట్ క‌థ‌నం పేర్కొంది. బ్రెజిల్‌ (Brazil) కు చెందిన గోమ్స్.. అక్క‌డి మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో ఉంటున్నారు. వృద్ధాప్య భారం వ‌ల్ల అంత‌ర్గత అవ‌య‌వాలు ప‌నిచేయ‌డం మానేయ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అత‌డి వివాహ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ప్ర‌కారం.. అత‌డి పెళ్లి 1917లో జ‌రిగింది. ఆ స‌ర్టిఫికెట్‌లో గోమ్స్ పుట్టిన రోజును ఆగ‌స్టు 4, 1895గా పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం.. అంటే అత‌డు 128వ ప‌డిలోకి అడుగుపెట్ట‌డానికి స‌రిగ్గా వారం రోజుల ముందు మ‌ర‌ణించాడు. గోమ్స్ త‌న జీవిత కాలంలో మూడు పాండ‌మిక్‌లు, రెండు ప్ర‌పంచ యుద్ధాలు చూశాడు.

అయితే ఇత‌డి వ‌య‌సుపై కుటుంబస‌భ్యులే కొంచెం అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ తాత‌ గారి వ‌య‌సు 110 నుంచి 120 మ‌ధ్య ఉండొచ్చ‌ని మ‌న‌వ‌రాలు ఎలైన్ ఫెరేరా అభిప్రాయ‌ ప‌డ్డారు. గోమ్స్ యువ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు తెలుస‌ని వీధిలో ఉంటున్న 98 ఏళ్ల బామ్మ పేర్కొన్నారు. పాత ప‌త్రాల్లో పొర‌పాట్ల‌కు తావుంటుందని.. అధికారులు ద‌ర్యాప్తు చేసి ఆయ‌న వ‌య‌సును శాస్త్రీయంగా నిర్థారించాల‌ని కుటుంబ‌స‌భ్యులు కోరుతున్నారు.

ఇక గోమ్స్ జీవ‌న శైలిని ప‌రిశీలిస్తే ఆయ‌న నాలుగేళ్ల క్రితం వ‌ర‌కు గుర్ర‌పు స్వారీ చేసే వార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆయ‌న చాలా సాధార‌ణంగా, సౌమ్యంగా ఉండే వారు. స‌హ‌జ‌మైన, దేశీయ ఉత్ప‌త్తుల‌నే దేనికైనా వాడే వారు. పారిశ్రామిక ఉత్ప‌త్తులంటే ఆయ‌న‌కు చిరాకు.

కోళ్లు, పందులను పెంచుకుంటూ.. మితంగా ఆల్క‌హాల్ తీసుకుంటూ గ‌డిపేయ‌డం ఆయ‌న‌కు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆయ‌నకు ఏడుగురు సంతానం కాగా ప్ర‌స్తుతం 25 మంది మ‌నవ‌లు 42 మంది మునిమ‌న‌వులు, 11 మంది ముని ముని మ‌నవులు ఉండ‌టం విశేషం.

ఏది ఏమైనా ఆయ‌న 1900 కంటే ముందే జ‌న్మించార‌నేది అంద‌రూ అంగీకరించే విష‌య‌మే. అయితే ఈయ‌న వ‌య‌సుని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ (Gunnies World Record) గుర్తించిందా లేదా అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు.

అందుబాటులో ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. 116 ఏళ్ల మారియా బ్రాన్యాస్ మోర‌ర్‌ను జీవించి ఉన్న అతి పెద్ద వ‌య‌స్కురాలిగా గిన్నిస్‌ బుక్ గుర్తించింది. తాజాగా వెనెజ్వులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటేను సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.