Maharashtra | ఓ వివాహిత తన భర్తకు దూరంగా ఉంటూ.. చెల్లిని లైంగికంగా వేధిస్తుంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు నచ్చక చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన ఓ 24 ఏండ్ల మహిళ ఉన్నత విద్యావంతులు. ఆమెకు కొద్ది రోజుల క్రితం వివాహమైంది. కానీ భర్తకు దూరంగా ఉంటుంది. విమానగర్లో ఆమె ఒక్కతే నివసిస్తోంది. అయితే ఇటీవలే.. అక్క ఇంటికి చెల్లి(18) వెళ్లింది. […]
Maharashtra | ఓ వివాహిత తన భర్తకు దూరంగా ఉంటూ.. చెల్లిని లైంగికంగా వేధిస్తుంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు నచ్చక చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన ఓ 24 ఏండ్ల మహిళ ఉన్నత విద్యావంతులు. ఆమెకు కొద్ది రోజుల క్రితం వివాహమైంది. కానీ భర్తకు దూరంగా ఉంటుంది. విమానగర్లో ఆమె ఒక్కతే నివసిస్తోంది. అయితే ఇటీవలే.. అక్క ఇంటికి చెల్లి(18) వెళ్లింది. ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి చెల్లి హాల్లో నిద్రిస్తుండగా, ఆమె వద్దకు అక్క వచ్చింది. ఆ తర్వాత చెల్లితో అక్క అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేసింది. ఇది తప్పు అని చెల్లి వారించింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సోదరి ప్రవర్తనతో విసిగిపోయిన చెల్లి.. చేసేదేమీ లేక పుణె ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.