బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌

బీఆరెస్‌కు రాజీనామా చేసిన వెంటనే జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు

బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌

కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో చేరిక

విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌కు రాజీనామా చేసిన వెంటనే జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఐటీ మంత్రి రాజీశ్ చంద్రశేఖర్, పార్టీ ఇంచార్జీ తరుణ్‌చుగ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు ఢిల్లీ బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీబీ పాటిల్‌కు బీజేపీ కండువా కప్పిన రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు పార్టీ సభ్యత్వం అందించి పార్టీలోకి ఆహ్వానించారు. బీబీ పాటిల్ జహీరాబాదర్ నుంచి 2014, 2019పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ నుంచి ఎంపీగా గెలిచారు.


తెలంగాణలో బీఆరెస్‌కు ఉన్న 9మంది సిటింగ్ ఎంపీలలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే ముగ్గురు పార్టీ మారిపోయారు. వారిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కాంగ్రెస్‌లో చేరిపోగా, నాగర్ కర్నూల్‌, జహీరాబాద్ ఎంపీలు పొతుగంటి రాములు, బీబీ.పాటిల్‌లు బీజేపీలో చేరారు. మరి కొందరు బీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.