Constipation | పొద్దున్నే ఆ ఇబ్బంది తొలగాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!
Constipation | మీరు మలబద్ధకం( Constipation )తో బాధపడుతున్నారా..? దీంతో కడుపు( Stomach ) అంతా ఉబ్బరంగా మారిందా..? ఈ ఇబ్బంది ఇతర శరీర అవయవాలపై( Organs ) ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు.. వంటింట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో ఉపశమనం పొందొచ్చు.
Constipation | చాలా మంది జీర్ణ సమస్యలతో( Digestive Problems ) బాధపడుతుంటారు. అంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం(Constipation ) వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యను దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే.. శరీరం రోగగ్రస్త అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఆ మలినాలు.. అన్ని అవయవాలను( Organs ) దెబ్బతీస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే మలబద్దకం నుంచి ఉపశమనం పొందొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..
మలబద్ధక ఉపశమనానికి చిట్కాలు ఇవే..
- రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టండి. పొద్దున్నే అవి తాగితే కొంత ఫలితం ఉంటుంది. మలబద్ధకం నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.
- ఒక చెంచా ఆముదం వేడి చేసి.. చల్లారక రాత్రి పూట తీసుకుంటే మలబద్ధకం పోతుంది.
- జిలకర్రను వేడి నీళ్లల్లో మరించి.. చల్లారిన తర్వాత ఆ నీటిని తాగినా మలబద్ధకం నుంచి విముక్తి పొందొచ్చు.
- కరక్కాయ చూర్ణం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగొచ్చు.
- మారేడు కాయ పండిన తర్వాత గుజ్జు తింటే మంచి విరోచనకారిగా పని చేస్తుంది.
- కరివేపాకులను బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. రెండు చెంచాల పొడిలో ఒక చెంచా తేనె కలుపుకుని తీసుకున్నా కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు.
- అనాస, మామిడి, సీతాఫలం, అరటి, సపోటా, టమాటా రసం వంటివి తీసుకున్నా సుఖ విరేచనం అవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram